పుట:Kanyashulkamu020647mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గిరీశం-- (తెల్లపోయి) తలుపు తియ్యొద్దు, తియ్యొద్దు ఆ పిలిచే మనిషి వెఱ్ఱిముండ. మనుషుల్ని కరుస్తుంది.

మధుర-- తలుపు తీసేవుంది.

గిరీశం-- చంగున వెళ్ళి గడియ వేసెయ్‌.

మధుర-- అదుగో తలుపు తోసుకు వొస్తూంది.

గిరీశం-- గెంటెయ్‌ , గెంటెయ్‌.

మధుర-- ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది. (మధురవాణి వాకట్లోకి వెళ్ళును)

గిరీశం-- మంచం కింద దూరదాం. (గిరీశం మంచం కింద దూరును.) (తనలో) దొంగలంజ సరసుణ్ణి దాచిందోయ్‌ మంచం కింద. యిదేవిఁటో మంచి మనిషి అని భ్రమించాను. దీన్తస్సా గొయ్యా. సిగపాయి దీసి తందునుగాని యిది సమయం కాదు. అయినా పోయేవాడికి నాకెందుకు రొష్టు, (రామప్పంతులుతో మెల్లిగా) యవరన్నా మీరు, మహానుభావులు?

రామ-- నేను రామప్పంతుల్నిరా, అబ్బాయీ.

గిరీశం-- తమరా, ఈ మాత్రానికి మంచం కింద దాగోవాలా, మహానుభావా? నన్నడిగితే యిలాంటి లంజల్ని యిరవైమందిని మీకు కన్యాదానం చేతునే.

రామ-- (తనలో) బతికాన్రా దేవుఁడా (పైకి) నువ్వురా బాబూ దీన్నుంచుకున్నావు! అలా తెలిస్తే నేరాకపోదును సుమా.

గిరీశం-- మాట వినపళ్ళేదు. కొంచం యిసుంటా రండి. (రామప్పంతులు ముందుకు జరుగును, గిరీశం అతన్ని తప్పించుకుని గోడ వేపు చేరును.) గిరీశం అన్నా, యీ లంజని యన్నడూ నమ్మకండి, యిలా యిరవైమందిని దాచగల శక్తుంది, దీనికి.

రామ-- రెండు వందలు దొబ్బిందిరా బాబూ.

గిరీశం-- నువ్వులేం జాగర్త చేశారా?

రామ-- అంతేనా?

గిరీశం-- మరేవిఁటీ?


[మధురవాణిన్ని పూటాకూళ్లమ్మ వల్లెవాటులో చీపురుగట్ట దాచిన్ని ప్రవేశింతురు]

మధుర: మీరన్న వ్యక్తి యిక్కడలేరంటే చెవినిబెట్టరు గదా!

పూట: నీ యింట్లో జొరబడ్డాడని వీధులో వాళ్ళు చెబితే నీమాట నమ్ముతానా యేవిఁటి? ఆ వెధవ వుంటే నాకేం కావాలి, వుండకుంటే నాకేం కావాలి. వాడు నీకిచ్చిన యిరవయి రూపాయలూ యిచ్చెయ్‌.