పుట:Kanyashulkamu020647mbp.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంచిగా వుండుటకు ప్రయత్నముచేస్తే, దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన యీలోకము మీకు మరింత యింపుగా కనపడుతుంది. మీకూ మీపరిచయం కలిగినవారికీ మరింత సౌఖ్యము కలుగుతుంది. కాక మంచిచెడ్డలు ఏర్పర్చగలిగినవాడు యెవడు? మంచిలోనూ చెడ్డవుంటుంది. చెడ్డలోనూ మంచివుంటుంది.

గిరీ- యేమి విలవైనమాటలు! ఒక చెడ్డమనిషి వున్నాడనుకోండి. ఒకణ్ణి అనడవెఁందుకు? నేనే ఆచెడ్డవాణ్ణి అనుకోండి. అట్టి చెడ్డవాడనైన నాయెడల మంచిగా వుండడమే యోగ్యత. తమవంటి మంచివారియెడల అంతా మంచిగానే వుంటారు. "అపకారికి నుపకారము । నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ" అని కవి అన్నమాట పర్‌ఫెక్‌ట్‌ జెమ్‌ కాదాఅండి?

సౌజ- నాభావం మా బాగా ఉపన్యశించారు.

కొత్తమనిషి- (సౌజన్యారావు పంతులుతో)తమవాక్యం గురూపదేశంగా భావించి, యిటుమీదట చెడ్డవారియెడలకూడా మంచిగా వుండడముకు ప్రయత్నిస్తాను. తమశిష్యరికం లభించడం నాకు పెన్నిధి. సత్పురుషుల దర్శనం సద్యోఫలం కలది. తాము మంచిలో చెడ్డవుంటుందని శలవిస్తిరి. పరిపూర్ణమైన తమ మంచిలో చెడ్డలేదని వింటున్నాను.

సౌజ- పరిపూర్ణమైన మంచి ఒక్క భగవంతుడియందేకలదు. నా చెడ్డ లోకవేఁ వెఁరుగును?

గిరీ- మిషనరీ ఒరిజినల్‌సిన్‌ అంటాడండి. మనవాళ్లు దుష్కర్మ అంటారు. దాంతస్సాగొయ్యా (బెగ్‌ యువర్‌ పార్డన్‌) ఆ ఒరిజినల్‌సిన్‌, లేక కర్మ, అనేది యెంత మంచివాడినైనా, యెంత కట్టుదిట్టవైఁనవాడినైనా రెక్కపట్టుకుని తప్పుతోవలోకి లాగుతుందండి. తమకు విశదముకానిది యేమున్నది?

సౌజ- "బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి" అని గీత చెబుతూంది. యెవడి చెడ్డ వాడు దాచుకుని, మంచినే పైకి కనపర్చుతాడు.

కొత్తమనిషి- ఒకానొకరు లేని మంచినికూడా వున్నట్టు ప్రచురపరిచి లోకాన్ని భ్రమింప చేస్తారు.

సౌజ- సత్యం. అందుచేతనే మంచి చెడ్డలు మనసే యెరగవలెగాని లోకమేవెఁరుగును అని అన్నాను.

కొత్తమనిషి- నటనవల్ల కొద్దికాలవేఁ లోకానికి కళ్లు కప్పవచ్చునుగాని, నిడివిమీద బంగారాన్నీ, యిత్తడినీ లోకం యేర్చేస్తుందండి. (గిరీశంతో) యేమంటారు?

గిరీ- పంతులుగారికి నిద్రభంగవౌఁతుంది. మీరు వచ్చినపనేదో-

కొత్తమనిషి- (సౌజన్యారావు పంతులుతో)స్వాభావికంగా మంచికి లోకంగుడ్డి; చెడ్డవెతకడానికి చారెడుకళ్లు; గనక, చూచ్చూసి, లోకం ఈయనమంచివారు,