పుట:Kanyashulkamu020647mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంక : వెళ్ళాల్నుందిగాని, పాసుకాలేదంటే మాతండ్రి చావ కొడతాడు.

గిరీశ: ఆ గండం తప్పే వుపాయం నేంచెబుతాను, నేంచెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చాస్తావూ?

వెంక : మీ శలవు యెప్పుడు తప్పాను? మాతండ్రికి మా చడ్డ కోపం. పాసు కాలేదంటే యెవిఁకలు విరక్కొడతాడు (కన్నీరు చేత తుడుచుకొనును).

గిరీశ : దటీజ్‌ టిరనీ -యిదే బెంగాళీ కుర్రవాడవుతే యేంజేస్తాడో తెలిసిందా? తాతయేది తండ్రయేది కర్ర పట్టుకుని చమ్డాలెక్కగొడతాడు; మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరి యవళ్ళయినా యీ వూళ్ళో చదువుకుంటున్నారా?

వెంక : మరి యెవళ్ళూ లేరు.

గిరీశ : ఐతే నేను వుపాయం చెపుతాను విను, నే కూడా నీతో మీవూరొచ్చి పరీక్ష పాసయినావని మీ వాళ్ళతో చెబుతాను అక్కడ నీకు చదువు చెప్పడానికి వొచ్చానని మీ వాళ్ళతో చెప్పు శెలవులాఖర్ని నిన్ను టవును స్కూల్లో పైక్లాసులో ప్రవేశ పెడతాను.

వెంక : మీరే వస్తే బతికాను మరేవిఁటి; కిందటి మాటు శలవులికే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది.

గిరీశ : ఆల్రైట్‌ గాని -నాకిక్కడ వ్యవహారములలో నష్టం వస్తుందే- మునసబుగారి పిల్లల్కి శలవుల్లో పాఠాల్చెపితే ఫిఫ్టీ రుపీజ్‌ యిస్తావఁన్నారు; అయినా నీ విషయవైఁ యంత లాస్‌ వచ్చినా నేను కేర్‌ చెయ్యను. ఒక భయం మాత్రం వుంది. మీ వాళ్ళు బార్బరస్‌ పీపిల్‌ గదా, నన్ను తిన్నగా ట్రీట్‌ చేస్తారో చెయ్యరో, నీవు నన్ను గురించి మీ మదర్‌ తో గట్టిగా రికమెండ్‌ చెయ్యవలసి వుంటుంది. కొత్త పుస్తకాలకి వక జాబితా రాయి -కొంచం డబ్బు చేతిలో వుంటేనేగాని సిగర్సుకి యిబ్బంది కలుగుతుంది. నోటుబుక్కు తీసి రాయి. 1. రోయల్‌ రీడర్‌ , 2. మాన్యూల్‌ గ్రామర్‌ , 3. గోష్‌ జియామెట్రీ, 4. బాస్‌ ఆల్జీబ్రా, 5. శ్రీనివాసయ్యర్‌ అర్థిమెటిక్, 6. నలచరిత్ర, 7. రాజశేఖర చరిత్ర, 8. షెపర్డు జనరల్‌ ఇంగ్లీష్‌ , 9. వెంకట సుబ్బారావు మేడీజీ, యెన్ని పుస్తకాలయినాయి?

వెంక : తొమ్మిది.

గిరీశ : మరొక్కటి రాయి. అక్కడికి పదీ అవుతాయి. కుప్పుసామయ్యర్‌ మేడ్‌ డిఫికల్ట్‌. అక్కడికి చాల్ను. మీ వాళ్ళుగాని యింగ్లీషు మాట్లాడ మన్నట్టాయినా తణుకూ బెణుకూ లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు జ్ఞాపకం