పుట:Kanyashulkamu020647mbp.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ- యేవాఁచ్చఱ్ఱెం! గురూ భోజినం యేటారగిస్తారు?

బైరాగి- పాలూ, పంచదారా, అరిటిఫలములూ, యీప్రకారం ఒకపక్షం ఫలహారం చేస్తాము. మరి పదిహేనురోజులు వాయుభక్షణ చేస్తాము.

రామ- ఒక్క మిట్టకాయలో పలారం జాగర్త చేస్తాం గురూ. మా రాంమందిరానికి దయసెయ్యాలి.

బైరాగి- పద- యీవూరి వింతలేవిఁటి?

లక్ష్మన్న- యేటీలేవ్‌- రావఁశంద్రపురం అగ్ఘురోరంలో ముసలిబాపనోడు ఆల్నిసంపేసినాట్ట. ఆడికీ దొంగసాచ్చీకం పలికినోళ్లకీ తాసీలుగోరికీ సిచ్చైపోతాదిట.

బైరాగి- యీవూరు పాపంతో నిండి వున్నట్టు కనపడుతూంది. యీ వూళ్లో మేము నిలవము.

రామ- లచ్చువుఁడు వెఱ్ఱోడు గురూ. ఆడిమాట నమ్మకండి. మీరెళ్లిపోతే మాలాటోళ్లు తరించడం యలాగ్గురూ? ఆళ్లీ వూరోళ్లుకారు.

బుచ్చన్న- ఆవూరి దుకాణదారుగారు అదుగో వొస్తున్నారు.

బైరాగి- యీవూళ్లో తాగడం లావుగావున్నట్టు కనపడుతుంది. మేము తాగుబోతులతో మాట్లాడం- ఆదుకాణదారు వచ్చేలోగా యీ సందులోకి మళ్లిపోదాం; రండి.

(దుకాణదారు పరుగునవచ్చి కలిసి బైరాగిమొలలో చెయివేసి పట్టుకొనును.)

దుకా- రూపాయలుకక్కి మరీ కదలాలి!

బైరాగి- యేమిటీవాళకం! వీడు తప్పతాగి పేలుతున్నాడు- నేను మొదటే చెప్పలేదా యీవూరి సంగతి? అంతా పాపంతో నిండివుంది! వేమన్న యేమన్నాడు. "తాగుబోతుతోడ! తగదెందునేస్తంబు"

రామ- (దుకాణదారుతో) భాయీ! మీకేటి, మతోయిందా? గురువుగోరికి దణ్ణవెఁట్టి లెంపలోయించుకొండి.

దుకా- గురువూలేదు, గుట్రాలేదు వూరుకోస్సి- యీడెక్కడ గురువు? నాదుకాణంలో సారా అంతా చెడతాగి డబ్బియ్యకుండా యెగేసినాడు.

రామ- మీకు మతోయిందా భాయి? ఆరేటి మీదుకాణంలో తాగడవేఁటి. కాశీనించి యిప్పుడే ఒచ్చినారుగదా?

దుకా- ఆకాశం బొక్కచేసుకుని వొచ్చాడుకాడూ? (బైరాగితో) డబ్బిచ్చి మరీ కదులు.

బైరాగి- మావంటి సాధులతో నీకు వాదెందుకు అబ్బీ? యవర్నిచూసి మేవఁనుకున్నావో! మమ్మల్ని పోలిన దాసరివాడొకడు, బైరాగి వేషంవేసుకుని యీ దేశంలో తిరుగుతున్నాడు. కిందటిమాటు మేం దేశసంచారం చేసినప్పుడు చూసి చివాట్లుపెట్టాం. నీకు డబ్బుమీద అంత కాపీనంవుంటే తులం రాగి