పుట:Kankanamu020631mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. ఇమ్ముల నున్న మమ్ముల ననేకవిధమ్ములఁ ద్రిమ్మరించి, యా
   తెమ్మరత్రిమ్మరీడు పెనుదిమ్మగ నిమ్మెయిఁ గ్రిక్కిఱించె; స్వాం
   తమ్మున నింతదారుణ విధానమెటుల్ మఱంపంగవచ్చు? స్వా
   స్థ్యమ్మెటులూనవచ్చుఁ బగసైఁపఁగలారెవిరాగు లేనియున్.

అంధకార వర్ణనము

మ. అకటా! మమ్మటు లావియచ్చటుల కారాగారమందుంచి, కం
    టకుఁడౌ తుంటరి గాలిదయ్యమపు డంతర్ధానమైపోయె; మే
    మొకటన్ మింటను గడ్డవారి చలనం బొక్కింతయున్లేక, యూ
    రక వర్షించితి మంధకారఘన ధారాపూరముల్.

క. ప్రాచి నవాచిఁ బ్రతీచి ను
   దీచిన్ బహుధాసముత్పతిత వితత తమో
   వీచీనిచయము చెలఁగెను
   మాచేత సమాసచేత మహి నమితంబై.

గీ. భీకరాకృతి సూచి కాభేధ్యమాన
   భూరినీరంధ్ర నిబిడాంధ కారఘోర
   వారినిధిపొంగి జగము ముంపంగ నాఁటి
   రాత్రి ధాత్రికిఁ బెనుకాళరాత్రి యయ్యె.