Jump to content

పుట:Kameshwaraishata020621mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాల్యంబో యన నొప్పువార్థకము దా మాయుంగదా? చింతల
న్శల్యంబు ల్నిగులున్ ద్వదీయపదవి న్సాధింప గామేశ్వరీ. 104

మ. తపముంజేయగలేదు, దానములు నే దథ్యంబుగా జేయలే
దెపుడుం, బెద్దలువల్కు చట్టముల యం దిచ్చంజరింపంగ లే
దిపు డేలాగుననో, భవచ్చరిత మం దిష్టంబుగల్గె న్మదిన్
నెపము ల్మూలకు ద్రోచి ప్రోవుమి నను న్నీ చార్ము గామేశ్వరీ. 105

మ. జననీగర్భములోన గొన్నిదినము ల్సాధుత్వముం జెందియుం
టినో లేదో వివరింప రా, దవల నా ఠీవుల్గణింపంగ నీ
కును శక్యంబని యెంచబో ననిన, నా కుంజక్కగా నీకడ
న్మనవింజేయగ నెట్లుశక్యమగు? న న్మన్నింపు కామేశ్వరీ. 106

శా. శ్రీరంజిల్లెడిపద్యము ల్శతకమై చెన్నొంద నీమీద నే
నారంభించిన దాది ని న్నడుగునా యాకోర్కులన్ గొన్ని మున్
దీరన్ దీరుచునుండె దీర గల నీ తీ ర్కొంత మాచ్యార్థతన్
గూరె న్వచ్చెడి దాని సూచనలెఱుం గున్ గాదె? కామేశ్వరీ. 107

సంపూర్ణము.

శ్రీ. శ్రీ. శ్రీ. శ్రీ. శ్రీ.

తిరుపతి వేంకటేశ్వరులు.