పుట:KaliyugarajaVamshamulu.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12

కూడను పురాణములలో నీయబడినది. దీనిని లోగడా చరిత్రకారులందరు యుపేక్షించి యుండిరి. అదియే సప్తర్షిమండలచలనము. దీర్ఘకాల లెఖ్ఖలను సరిచూచుకొనుట కీ సప్తర్షిమండల చలనమును రాజవంశావళీ కాలముతో వరుసను గుర్తించుచు పురాణము పై వాక్యములను చెప్పి యున్నది. గనుక దాని ననుసరించి మనము భారత యుద్ధకాలమునుండి వరుసను రాజవంశావళుల కాలమాను గుర్తించుదము.