పుట:KaliyugarajaVamshamulu.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్లో: "పూర్వాభాద్రాం యదోతేతు ప్రవేక్ష్యంతి పునర్ద్విజాః

గుప్తే భ్యో మాగధం రాజ్యం తదాపాలన్ గమిష్యతిః" (కలియుగరాజ వృత్తాంతం. 2 భా. 3 అధ్యా.)

తా|| యుధిష్ఠురుని కాలములో సప్తర్షులు మఖమందు నూరు సంవత్సరములుండిరి. మహాపద్మనందుని కాలమున అది శ్రవణ నక్షత్ర శతమునందుండినది. ఆంధ్రుల పరిపాల (మగధయందు) సాగించు నాటికి సప్తర్షి మండలం ముఖనుండి యిరువది నాలుగవ నక్షత్రమందుండ గలదు. పరీక్షితుని జననము లగాయతు మహాపద్మనందుని పట్టాభిషేకము వరకు 1500 సం||రములు . నందాభిషేకము నుండి ఆంధ్ర రాజ్య ప్రారంభముకు 800 సం||రములు సప్తర్షిమండలము (రెండవ ఆవర్తిలో) పునర్వసు నక్షత్రమును చేరునాటికి గుప్తరాజ్యము క్షీణదశకు రాగలదు. అది పూర్వ్వాభాద్రానక్షత్రమును చేరునప్పటికి గుప్తులదైన మగధ రాజ్యము "పాలరాజుల" ను చేరును,అని చెప్పబడినది.

             (కలియుగ రాజవృత్తాంతం 2 భాగం 8 అధ్యా)

పై వాక్యములు "సప్తర్షి మండలం వెనుకకు తిరుగునని నిర్ణయించుకుని చెప్పబడినవి. మనకిప్పుడు కావలసినిది సప్త్రఋర్షిమండల చలనమేవైపుగా నుండ్నని కాదు. భారతయుద్ధము పిమ్మట ఆంద్రుల సాంరాజ్యమునకెంత కాలముగడిచెనని విచారించుచుండెను. ఈకాల నిర్ణయమును గురించి పురాణములు ప్రతిరాజుకు, అతడుపరిపాలించిన సంవత్సరములనుచెప్పి,పిమ్మట ఆవంశముmsg మొత్తమెంతకాలము పరిపాలించినది వివరించి అంతటితో తృప్తినొందక కాలక్రమమున పాతప్రవచనములలోను, వ్రాతప్రతి వ్రాయునపుడు విద్వాంసులు కాని వ్రాయనకాని లోపములచేతను, వ్రాతప్రతులచ్చొత్తించునపుడు దొర్లెడి దోషములవలనను,గ్రంధమును సవరించి పరిష్కరించెడి పండితుల భావముల ననుసరించి సవరణలు జరుగుచుండుటవలనను గలిగెడిలోటుపాట్లను గుర్తించి రాజవంశావళి కాలములను సరిచేసుకొనుట కనుకూలముగా నుండులాగున యెట్టిస్తితిగతులలోను పొరబాటభిప్రాయముల కెడమీయనట్టియు, ప్రకృతి సిద్ధముగానుండునట్టియు నొకలెఖ్ఖ