పుట:Kadapa Oorla Perlu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

౨౩

వుండేది. తంజావూరు జిల్లాలో 1877-78 మధ్యకాలం లో "Madras Coast Series of the Great Trignometrical Survery of India" లో పాల్గోంటూ, జిల్లాలోని స్థలనామాలను ప్రాంతీయ భాషోచ్చారణా విధేయంగా ఇంగ్లీషులో లేఖన చిహ్నాలతో , రాసుకొని , కావేరీ తీర స్థలనామాల ద్వారా వెల్లడయ్యే నీటి పారుదల ; వ్యవసాయం , భౌగోళిక స్థితిగతులూ , పర్వత ప్రాంతాలు, తటాకాలూ, లేని స్థితీ; బ్రాహ్మణ కులాధిక్యత , నాగపూజ, వృక్షపూజ, రాజకీయ చరిత్రా, వృక్ష జంతు సంపదా మొదలైన సాంస్కృతిక విశేషాలను వివరించడమే కాకుండా వాటి వ్యుత్పత్తి పరిశీలన జాగ్రత్తగా చేస్తూ వ్యాసం రాయడం నిజానికి ఆ రోజుల్లో అపూర్వమైన విషయం. ఆ వ్యాస ప్రభావమే తర్వాతి పరిశోధనల పై బలీయం గా పడిఉంటే దాక్షిణాత్య భాషల్లో స్థలనామ పరిశోధన ; లేదా వూర్లపేర్ల పరిశోధన ఇంతటి బాల్యావస్థలో ఉండిఊండేది కాదు. మన వాళ్ళు ఇటీవల ప్రచురించిన తాలుకా సర్వేపటాలలో ఇంగ్లీషు లో ఉన్న వూర్ల పేర్లు తప్పుల తడకలతో వుండి వుండేవి కావు. నిర్ధుష్తమైన సమగ్ర స్థలనామ సేకరణ కూడా జరిగిఉండేదేమో.

పేర్ల సేకరణలో లేఖన ప్రామాణికతను గూర్చీ, వాటి అర్ధ వివారణనూ గూర్చీ బ్రౌన్ ఫిల్ అభిప్రాయాలూ, ఈ నాటికీ ఎంత ఆలోచనత్మకంగా , ఆచరణీయం గా ఉన్నాయో వూర్ల పేర్లను వాడే పరిపాలనా సిబ్బంది , పరిశోధక , మేధావులూ గమనించాలి.

" My Prime object was to find out personal inquiry on the sport the correct vernacular form of all names of places that I must submit to the Surveyor General for publications on the Charts and records of the work. The list comprises therefore, the names of all the Survey Stations, the topographical features of the ground mentioned in describing them, the surrounding villages, and the divisions of the district to which they belong. A few other names of interest met with are also included. The remarks and etymologies here offered must be regarded as crude suggestions by the way, and not as having any pretensions to scholarship or independent research. They are simplyi a desultory collection made bya traveling official in a certain locality, during a busy tour of a few months:.

" the English seem peculiarly unhappy in their rendering of Indian proper names. Most of them would perhaps admit so much, but yet be quite averse to learn and adopt any system of