పుట:Kadapa Oorla Perlu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెకంజీ కైఫీ యతుల్లో పేజీలకు పేజీలున్న వూర్ల పేర్ల పుట్టు పూర్వోత్తరాలను, స్థలపురాణాలను సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది.)

2. వ్యుత్పత్తి నిర్ణయానికి చారిత్రిక రూపాల ప్రధాన్యం యెంతయినా వుంది. కానీ వాటిలో లేఖక ప్రమాణాలు, క్రుతక ప్రామాణికాలు , కురూపాల్లు, లోక విరుక్తికి అనువైన శాభ్దిక వ్యభిచారము ఉండవచ్చు.

(అ) లేఖక ప్రమాదానికి ఉదా: చూ. ఆరో. అగుదూరు శా.రూ. అమడూరు , 1544 AR 1945-46, B 111.

(ఆ)కృతక ప్రామాణికాలానికి ఉదా: ఇబ్రహీం పురం F.F. విభాళాం పురం

(ఇ) కురూపానికి ఉదా: ఆరో . కొమంత రాజపురం.

(ఈ) లోక నిరుక్తికి ఉదా: ఆరో . అత్తిరాల . మెకం హత్యరాల .ఈ విధమైన ప్రభావాలకు లోనైన వూర్ల పేర్లు వ్యుత్పత్తి నిర్ణయం లో చారిత్రిక రూపాలను బహు జాగ్రత్తగా గ్రహించ బడి వుంటుంది.

8.చారిత్రిక రూపాల ప్రమేయం లేకుండా నే వాడుకలో ఉన్న వూర్లపేర్ల రూపాలను బట్టి వ్యుత్పత్తి నిర్ణయం చేయవచ్చు. కడప, కమలాపురం , రాజం పేట, కృష్ణాపురం వంటి ఊర్ల పేర్ల వ్యుత్పత్తి నిర్ణయం కష్తమేమి కాదు. కానీ, - ఆపి ; ఊరు ఓలు ; కొమెర్ల ;- దెన , మడక; - మెల - మళ్ళయం ; రాల వంటి ద్వితీయా వయవాలతో ఉన్న పొత్తవి ; చిలంకూరు, తక్కోలు, చిన్న దొమ్మెర్ల ,అలిదెన ; ఇడమడక ; అనిమెల ; కలమళ్ళ, పెద్దముడియం , అత్తిరాల, వంటి ఊర్లపేర్లకు అర్ధం చెప్పాలంటే వాటి ఒకప్పటి వాడుక రూపాలు అంటే చారిత్రిక రూపాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. అయితే ప్రాచీన శాసన సంపదను పరిరక్షించుకోలేని మనం ; దొరికిన శాసన సంపదను ఇంకా ప్రచురించలేని మనం అన్నిగ్రామాలకూ చారిత్రిక రూపాలను సంపాదించుకోలేము. ఈ నిఘంటులోని 3403 ఊర్లలో 752 ఊర్లకు మాత్రమే చారిత్రిక రూపాలు లభించాయి. కడప జిల్లాలోని వందలాది శాసనాలు, ప్రచురితమైతే మరికొన్ని రూపాలు లభించవచ్చు.

4.అయితే , చారిత్రిక రూపాలున్నా , కొన్ని చోట్ల వాటి వ్యుత్పత్తి నిర్ణయం సులభం కాదు. అటువంటి సంధర్భాలలో వ్యుత్పత్తి నిర్ణయానికి సగోత్ర రూపాల్ (Cognate Forms) తులనాత్మక పరిశీలనయే శాశ్త్రీయం. ఈ.