పుట:Kadapa Oorla Perlu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౮ వర్గీకరణ , 3. స్థల నామ పరిశోధనా ప్రయోజనం - వికాసం, ఈ పరిశోధన పూర్వ రంగం గా ప్రతిపాదింపబడినాయి. డా. చేకూరి రామారావు వంటివారు సంఙఞానామ తత్వ సమస్య పరామర్స , చాదస్తమన్నా , ఆ విషయం మీద కూడా పరిశోధనావకాసాలు ఉన్నాయని తెల్పడానికి , సంజఞానామాల్లో వూర్ల పేర్ల ప్రతిపత్తిని నిరూపించడానికి ఆ అధ్యాయం రాయడం జరిగింది. తర్వాతి నాల్గు అధ్యాయాలు కడప వూర్ల పేర్ల వివరణాత్మక వ్యాకరణానికి సంబందించినవి. అవి.: 4. వర్ణ సమామ్నాయ పరి శీలన . 5. సంధి పరిశీలన 6. రూప నిర్మాణ పరిశీలన 7.కారక నిర్మాణ పరిశీలన 8. అర్ధ పరిశీలన 9.వ అధ్యాయం లో కడప వూర్ల పేర్లను బట్టి తెలియదగిన భాషేతర విశేషాలు - నైసర్గిక , సాంసృతిక , చారిత్రిక విశేషాలు 9 స్తూలంగా చర్చించ బడినాయి. ఒక ప్రత్యేక గ్రంధం గానే రాయదగిన అధ్యాయం ఇది.

రెండవ భాగం : కడప జిల్లా గ్రామనామ నిఘంటువు - వ్యుత్పత్తి పరిశీలనాత్మకం

ఆంగ్ల భాషలో స్థలనామ నిఘంటువులు రెండు , మూడు వెలసినాయి. కానీ ఇంతవరకు ఏ భారతీయ భాషలల్లోనూ స్థలనామ నిఘంటువులు , కానీ , గ్రామనామ నిఘంటువులు కానీ వెలువడ లేదు .

ఈ నిఘంటు నిర్మాణం లో ఆరోపాల నిర్ణయం ఒక ఎత్తయితే , వాటి వ్యుత్పత్తి వివరణ మరొక ఏత్తు. వ్యుత్పత్తి నహిత గ్రామనామ నిఘంటు నిర్మాణానికి భారతీయ భాషల్లో నే ఇది ప్రథమ ప్రయత్నం. ఆంగ్లభాష స్తలనామ నిఘంటువు లోని ఆధునిక కోశ నిర్మాణ సూత్రాలను సాధ్యమైనంతవరకు గ్రహించి , కడప వూర్ల పేర్ల వరకే పరిమితమైన ఈ నిఘంటువులో వాటిని సమన్వయించడం జరిగింది. ఇటువంటి సమన్వయంతో రూపొందింపబడిన ఈ నిఘంటు నిర్మాణ పథకం కొంత వరకు అపూర్వం కాబట్టి , ఇక ముందు తెలుగులో కానీ, ఇతర భారతీయ భాషల్లో గానీ కూర్పబడే గ్రామనామ నిఘంటువు లకు లేదా స్థలనామ నిఘంటువులకు ఇది సహాయం కావచ్చు.

కడప ఊర్ల పేర్ల వ్యుత్పత్తి నిర్ణయం లో ప్రధానం గా ఈ క్రింధి సూత్రాలను పాటించడమైనది

1. వ్యుత్పత్తి నిరూపణ లో నేటి పేర్లకు లభ్యమైన శాసనస్థ , గ్రంధస్థ రూపాలను కాల క్రమాను గతంగా సేకరించడం ( ముఖ్యం గా 1790 ప్రాంతాలకు చెందిన.