పుట:Kadapa Oorla Perlu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౪

ఒక నమూనా పరిశీలన" అనే ఔత్సాహిక వ్యాసాన్ని రాసి S. V. University Oriental Research Institute Journal వారి కి ఇచ్చినాను. వారు గ్రాంధికం లో ప్రచురించినారు. అప్పటికింకా చిలుకూరి నారాయణ రావు గారి అనంతపురం జిల్లా గ్రామనామాలపై అపూర్వ మీమాంస ను కూడా చూడలేదు. (వివరాలకు చూడు ఫు. 57 -60)

నా ఉత్సాహాన్ని దారిలో మళ్ళించేదుకు 1968 లో Full Time Research Scholar గా చేర్చు కో డాని కి , పర్యవేక్షణ చేయడానికి అచార్య రెడ్డి గాఉ వొప్పుకున్నారు. 1963-70 మధ్యకాలాని కి నెలకు రు. 250/- యు. జి. సి. స్కాలర్ షిప్ ను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మంజూరు చేసింది. ఈ స్కాలర్ షిప్ ను జీత నష్టం మీద తీసుకోవడాని కి ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ వాఉ వొప్పుకుని రెండేళ్ళు నెలవు మంజూరు చేసినారు. 1968, నవంబరు 15, తెలుగు శాఖలో పరిశోధక విద్యార్ది గా చేరినాను. చేరినాక గానీ ఈ పరిశోధన లలోని సమస్యలు అర్ధం కాలేదు. ఈ విషయం లోతు అవరతం కాలేదు. ఊర్ల పేర్లు పరిశోధనాంశ మేమిటని అనే చిన్న చూపు చూసే వాళ్ళ మధ్య ఈ విషయాలమీద వచ్చిన గ్రంధాలనూ, వ్యాసాలనూ, దొరికిన మేరకు తిరగవేసినాను.

ఎస్ .కుర్ల్ ఉత్తర ప్రదేశ్ లోని షహ్రన్ పూరు స్తలనామాల మీద పరిశోధన చేసినాడని , అతని సిద్దాంత వ్యాసం ఆగ్రా విశ్వవిద్యాలయం లో ఉందని డా.జాస్తి సూర్య నారాయణ గారు తెలిపితే దాన్ని తెప్పించుకొని చూసినాను.

ఊర్ల పేర్ల పరిశోధనలో మూడు ప్రధాన సమస్యలున్నా యని తెలిచింది. నానా రకాల ప్రభుత్వ రికార్డులూ , జిల్లా గెజిటద్లూ., మాన్యు వల్సూ , సర్వేమ్యాపులూ, నుంచీ ఊర్ల పేర్లను సేకరించడం ఒక సమస్య అనీ, శాసనాలు, మెకంజీ కైఫీ యుతుల వంటి చారిత్రిక పత్రాలలోని ఈనాటి ఊరి పేర్లను సేకరించడం ,గుర్తించడం, ఎడిట్ చేయడం , పరిశోధనకు సామగ్రి ని , సిధ్ధ్ం చేయడం (వివరాలకు చూ. పు. 15) రెండో సమస్య అని ఊర్ల పేర్ల వివరణ కు సంబందించిన రచనా ప్ర ణాళికను (Methodology) రూపొందించుంచు కోవడం మూడవ సమస్య అని తెలిసింది.

మొదట రాయలసీమ జిల్లాల లోని ఊర్ల పేర్లన్నిటినీ సేకరించి పరిశీలిస్తే బావుంటిందనీ అనుకున్నాము. నమూనాకు కడప జిల్లా ని ఆయా తాలూకా కేంద్రాలు చెడ తిరిగి , కలెక్టరు కార్యాలయాం ప్రదక్షిణ చెసి రికార్డులనుండీ రెవెన్యూ