పుట:Kadapa Oorla Perlu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూమిక

భాషాశాస్త్ర సంబంధమైన విషయమై పరిశోధన చేయాలని కుతూహల పడుతున్నప్పుదు గురువర్యులు ఆచార్య జి. ఎన్. రెడ్డె గారు తెలుగు ఊర్ల పేద్లను గురించి పరిశోధిస్తే బావుంటుందన్నారు. పరిశోధనలో కొత్త పుంతలు చూపే మార్గదర్శకత్వం అయినది. ఊర్ల పేర్లు ఎక్కడ దొరుకుతయో తెలీకుండానే , అవి ఏ రకమైన పరిశోధనా సామగ్రో అర్ధం కాకుండానే , తెలుగు పరిశోధనా రంగం లో ఈ రకం కృషి అపూర్వం కాబట్టి , తెలుగులో ఒక కొత్త విషయం మీద పరిశోధన చేసే అవకాశం లభిస్థోంది కదా అనే ఉత్సాహం తో నూ, గురువు గారి ప్రేరణ తోనూ గ్రామానామారణ్యం లో చొరబడినాను.

ఈ రంగం లో ఔత్సాహెకంగా నా మొదటి ప్రవేశం 1966 లో, తెలుగు ఊర్ల పేర్ల మీద 1945 ప్రాంతం లో శ్రీ ఎ. ఎస్ . త్యాగరాజు గారే వో వ్యాసాలు రాసినారని ఆచార్య రెడ్డి గారు తిరుపథి లో వారి వద్దకు తీసుకువెళ్ళినారు. త్యాగరాజు గారు వెన్ను తట్టి నారు. తమ వ్యాసాలతో పాటూ , ఇసాక్ టెయిలర్ 'Words and Places అనే పుస్తకాన్ని ఇచ్చి ఉపయోగించు కోమన్నారు. ( చూడండి. పు. 60) . ఇదే రోజుల్లో తమిళం లో ఆర్. పి . సేతు పిళ్ళై రాసిన వ్యాసాలున్నాయని , వాటిని ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి గారు నాకు పంపినారు. ప్రముఖ పురాతత్వ శాస్త్రతత్వ వేత్త హె. డి. సంకాలియా " Studies in the Historical and Cultural Geography of Gujaraat (1949)" అనే గ్రంధాన్ని పరిచయం చేసినారు. పూనా నుంచి ఆ గ్రంధాన్ని తెప్పించుకున్నాను. ఈ దశ లోనే శ్రీ మతి నాయని కృష్ణకుమారి గారు "{తెలుగు ఊర్ల పేర్లు " అనే భారతి లో అచ్చయిన (1957)వ్యాసాన్ని కూడా చూదదం తటాస్థించిండి. తెలుగు ఊర్ల పేర్ల మీద ఒక వ్యాసాన్ని రాసి ప్రచురిస్తే కానీ పరిశోధనా విద్యార్దిగా తీసుకోవడం బావుండదని ఆచార్య రెడ్డి గారు ప్రోత్సాహకాంక్ష పెడితే నా దగ్గరున్న కొద్దిపాటి సమాచారం తో , వివిధ ఆంగ్ల విజ్ఞా సర్వస్వాల్లోని వ్యాసాల ప్రస్తావనలతో , ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంధాలయం నుంచి రెడ్ది గారు తెప్పించిన " Alphabetical List of Villagesin the Taluks and Districts of Madras Province" సాయం తో "తెలుగు ఊర్ల పేర్ల యందలి అనుబంద రూపములు. .