పుట:Kadapa Oorla Perlu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(Topnyms) . ఈ రెండు శాఖల కు సంబంధించిన పరిశీలన కేవలం భాషాశాస్త్రజ్ఞులకే కాక , ఇతర సామాజిక శాస్త్రజ్ఞులకూ సామాన్యులకూ కూడా ఆసక్తికరమైన విషయం.

పాశ్చాత్యదేశాలలో వ్యక్తి నామ , స్థల నామ పరిశీలనలు ప్రారంభమై ఒక శతాబ్దం కావస్తున్నది. ఈ శతాబ్దకాలం లో ఆ పరిశీలన అతి శాస్త్రీయం గా రూపొందింపబడి విద్యారంగం లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యయన విషయం గా గుర్తింపబడింది. సంజ్ఞానామాల కు సంబధించిన , ప్రత్యేక సంఘాలు కూడా పాశ్చాత్యాదేశాలలో ఎర్పడి తీవ్రం గా కృషి చేస్థున్నాయి. నామ విజ్నానసంభంద ప్రచురణలూ , పత్రికాలూ చాలా వస్తున్నాయి.వివిధ దేశాలలో స్థలనామాలు సర్వేలు కూడా జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నామ విజ్నానికి సంభందించిన ఒక ప్రత్యేక సంస్థ 1949 లో బెల్జియం లో స్తాపించబడినది. ఇట్టి ప్రాధానాన్ని గడించుకొన్ననామ విజ్నానం మన దేశం లో ఇంకా గుర్తింపుకు రాకపోవడం శోచనీయం. అతి పురాతన మైన చరిత్ర , వివిధ భాషాసంస్క్రుతుల సమ్మేళనం కలిగినట్టి భారతదేశం నామవిజ్నాన పరిశీలనకు ఒక 'ఒక స్వర్ణ భూమీ.

భారతదేశం లో స్థలనామాలకు సంభందించి ఔత్సాహిక దృష్తితో తొలి కృషి చేసినవారు పాశ్చాత్యులు. దక్షిణ డేశం లో మెకంజీ, బ్రౌన్ ఫెల్ , కాల్డ్వెల్, సి. పి. బ్రౌన్ , మొదలైన పాశ్చాత్యులు స్థలనామాలకు సంబందించిన వ్యాసాలను 19 శతాబ్దిలోనే ప్రచురించినారు. స్థలనామ పరిశీలనకు వారిచ్చిన ప్రోత్సాహాన్ని దేశీయులు ఇటీవలి వరకు స్వీకరించక పోవడం కూడా వింతగా నే కనిపిస్తుంది. స్థలనామాలన్నప్పుడు కేవలం ఊర్ల ఫేర్లే కాదు, నాడులు, నదులూ, వాగులూ, కొండలూ, కోనలూ, అడవులూ, మొదలైన భౌగొళిక రూపాలాకు ఆయా భాషల్లో అనాదిగా ఉన్నపేర్లన్నీ కూడా స్థలనామ విజ్నానానికి ముడి పదార్దాలు అవుతాయి. ఇట్టి స్థల నామాలు ఆంధ్ర దేశాని కి సంభందించి లక్ష దాకా ఉంటాయి. ఇక వీధుల పేర్లను చేర్చుకున్నట్లయితే