పుట:Kadapa Oorla Perlu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రస్తావన

మన విస్వవిద్యాలళొ తెలుగు భాషా సాహిత్యాలను గురించి ఇటీవల పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వివిధ అంశాల మీద పరిశోధనలు సిద్దాంత వ్యాసాలు సమర్పిస్తున్నారు. ఈ పరిశోధనలను సమీక్షించి నట్లయితే తెలుగులో సాహిత్యపరంగా జరుగుతున్న పరిశోధన ఎక్కువ, భాషా విషయిక పరిశోధన తక్కువ అనిపింస్తుంది.ఇంతవరకూ వచ్చిన సిద్దాంత వ్యాసాలలొ నాలుగింట మూడు భాగాలకు మించినవి సాహిత్యపరమైనవే. ఆందులోనూ ప్రాచీన సాహిత్యనికే ప్రాధాన్యం ఎక్కువ. వాస్థవానికి తెలుగులో వెలసిన తొలి సిధ్ధాంత వ్యాసం భాషా పరమైనది. అదే చిలుకూరి నారాయణ రావు గారి "ఆంధ్రభాషా చరిత్రము :(ఆంధ్ర విశ్వవిద్యాలయం 1937).కానీ భాషా శాస్త్రపరం గా ఇత్లా ప్రారంభ మైన తెలుగు పరిశొధన భాషావిషయక పరిశొధనలొ వెనుకబడడఒకొంత విడ్డూరంగా నే కనిపిస్తుంది.


తెలుగు భాషా రంగం లొ జగరవలసిన పరిశోధన ఎంతో ఉంది. పాశ్చాత్యదేశాలలొ జరుగుతున్న పరిశోధనలతో పోల్చి చూస్థె మనం ఇంకా శైశవావస్థలోనే ఉన్నాం. భాషా నిర్మాణం , చరిత్ర , అర్థ తత్వం తులనాత్మక సమీక్ష , మాండలికాల పరిశీలన మొదలైనవి కేవలం భాషావిజ్ఞానికి చరిత్ర , పురాతత్వశాస్త్రం , మానవ శాస్త్రం, సాంఘిక శాస్త్రం , మానసిక శాస్త్రం, మొదలైన సామాజిక శాస్త్రాలతో సన్నిహిత సంభంధం ఉన్నది. అట్టే సన్నిహిత సంభంధాన్ని అధికం గా కలిగినట్టి భాషా విజ్ఞాన విభాగం సంజ్ఙానామ శాస్త్రం (Onomastics)

ఈ విజ్ఙానం లొ ప్రధానం గా రెందు శాఖలున్నాయి.ఒకటి వ్యక్త నామ విజ్ఞానం ( Anthroponymy), రెనదవది స్థల నామ విజ్ఞానం