20
భక్తమాల.
మును విధ్వంసము చేయలేదు; బలిని మోసపుచ్చుటకై యతఁడు పాతాళమునకు దిగలేదు. అతఁడు వరాహరూపమును ధరింపలేదు; క్షత్రియులను పరిమార్పను లేదు. ఆతఁడు తనవ్రేలికొనమీఁద గోవర్ధనపర్వతము నెత్తలేదు; అటవీవాటికల యందు గోపికలతోఁ గూడియుండను లేదు. అతఁడు సాలగ్రామము కాడు. మఱి యేఱాయియు కాఁడు. అతఁడు మత్స్యము కాఁడు. కూర్మము కాఁడు, జలచరములైనవి యివెవ్వియును గాఁడు. అతఁడు ద్వారావతియందు నిర్యాణము చెందలేదు. జగన్నాధమునం దాతని శవము ఖననము చేయఁబడను లేదు. కబీరు లోకమునకు ప్రకటించునది యేమనఁగా: –
"ఈ లాటి బోధనల, నెవ్వఁడును అనుసరింపవలదు. ఎవ్వానిని స్థూలమును భౌతికమును నైన యుపాదానము కలవానినిఁగా భావించుచున్నారో, వాఁడు బహుసూక్ష్మధర్మములు కలవాఁడు."
15. కాశీలో కాపురముచేయుచుండిన శివునితోఁ గూడ బ్రహ్మ అప్పుడే చచ్చిపోయినాఁడు. మధురానగరమునందు గొల్లవాఁడైన శ్రీకృష్ణుఁడు ప్రాణములు విడిచినాఁడు. దశావతారము లన్నియు నిదివఱకే గతించినవి. మత్స్యేంద్రనాధుఁడు, గోరకనాధుఁడు, దత్తాత్రేయుఁడు, వ్యాసుఁడు ఈ యందఱిప్రాణములును పోయి చాలకాల మైనది. కబీరు ఉద్ఘోషించునది యేమనఁగా: -
"ఈ మనుష్యు లందఱును గూడ మృత్యువు వలలో బడిపోయినారు. "
16. అన్ని సంగతులును మనస్సునకుఁ దెలియును; తెలిసియుండియు పాపము లొనర్చుచున్నది. చేతిలో దీప ముండియును నూతిలోఁ బడినప్పుడు, ఇంక నాదీప ముండిన ప్రయోజన మేమి?
17. మాతృగర్భమునం దుండినప్పుడు జాతియు లేదు, వర్ణము లేదు; బ్రహ్మ బీజమునుండి సృష్టి యంతయుఁ గలిగినది. ఓపండితుఁడా! బాహ్మణు లెప్పుడు సృష్టింపఁబడినారో చెప్పు! "నేను బ్రాహ్మణుఁడను" అని చెప్పుకొన్నందువలన నీమతము నీజీవము నశించుచున్నవి సుమా! నీవు బ్రాహ్మణస్త్రీవలనఁ గలిగిన బ్రాహ్మణుఁడవే యైన పక్షమున నీవు వేఱుమార్గమున నేల పుట్టవైతివి ?
ఎవ్వరివాఁడవు నీవు? బాపనివాఁడవా? నే నెవరివాఁడనెను? శూద్రపువాఁడనా? నే నెవరిరక్తమువలన పుట్టితిని? నీ వెవరిక్షీరములవలన జనించితివి? కబీరు సూక్తి యేమనఁగా: బ్రహ్మమునుగూర్చి యెవ్వాఁడు చింతనసేయునో వాఁడె నాచేత బ్రాహ్మణుఁ డని పిలువఁబడుచున్నాఁడు. వర్ణమునుండి వర్ణము బయలు