పుట:Jyothishya shastramu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపంచ విషయములతో కూడుకొన్న కర్మలేగలవు. అట్లే రెండవ భాగమైన అర్థాంగి భాగములో 7వ స్థానము పెళ్ళితో సంబంధమేర్పడు భార్య విషయముండును. పెళ్ళి కార్యమంతయు దైవజ్ఞానముతో కూడుకొని యున్నది. తర్వాత 9,10,11,12 స్థానములన్నీ దైవజ్ఞానము సంబంధ విషయములకు సంబంధిత ఫలితములున్నవి. అందువలన అంగీ భాగము అజ్ఞానముతో కూడుకొనియున్నదనీ, అర్థాంగి భాగము జ్ఞానముతో కూడుకొనియున్నదనీ చెప్పవచ్చును.

ఇప్పుడు మనము చెప్పుకోవలసిన 2వ స్థానము అంగీ భాగము లోనూ, 8వ స్థానము అర్థాంగి భాగములోనూ కలదు. అందువలన 2వ స్థానము ప్రపంచ సంబంధముగా ఉండుననీ, 8వ స్థానము దైవ సంబంధముగా ఉండుననీ తెలియుచున్నది. కర్మచక్రములో ఇంతవరకు మిగిలిన 2 మరియు 8 స్థానములలో ఏ కర్మయున్నదో గమనిద్దాము. అంగీ భాగములోని 2వ స్థానమును చూస్తే 1వ స్థానము శరీర ప్రారంభ మునకు సంబంధించిన కర్మ అందులో ఉన్నది కదా! శరీరములో జీవితము ప్రారంభమైన దినమునుండి మనిషికి అజ్ఞాన జీవితమే గడచుచుండును. దైవజ్ఞానము మీద ధ్యాస పెళ్ళి తర్వాత రావచ్చునేమోగానీ, అంతవరకు ఎవరికైనా జ్ఞానజీవితము మీద ధ్యాసరాదు. పెళ్ళి తర్వాత దైవము మీద ధ్యాస మనిషికి కలుగవచ్చును. పుట్టుక అజ్ఞానములో జరిగినా పెళ్ళి జ్ఞాన సంబంధముగా ఉండవలెనని పూర్వము మనిషికి చేయు పెళ్ళిలో అంతా జ్ఞానమునకు సంబంధించిన కార్యములనే ఉంచారు. అందువలన 1వ స్థానము తర్వాత రెండవ స్థానమున మనిషి తన జీవితములో అజ్ఞాన జీవితము ఎంతకాలము గడుపుననీ, చివరికి అతను ఎంత అజ్ఞానిగా చనిపోవును, అజ్ఞాన జీవితము ఎంతకాలముండును అనుటకు