పుట:Jyothishya shastramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శక్తియుండును. అర్ధాంగి భాగములో 9,10,11 స్థానములు దైవ భావమునకు సంబంధించినవని చెప్పవచ్చును. అయితే పదిలోనున్న జ్ఞానశక్తి, తొమ్మిదిలోనున్న జ్ఞానధనము పదకొండులోనున్న జ్ఞాని గ్రాహితశక్తి కర్మకు లోబడియుండవు. అందువలన కర్మ ఆధారముతో జ్ఞాన ధనమును గానీ, జ్ఞానశక్తినిగానీ, జ్ఞాన విచక్షణనుగానీ (జ్ఞానమును గ్రహించుకొను శక్తినిగానీ) గుర్తించి చెప్పలేము. 9,10,11 స్థానములలోనున్న వాటిలో కొన్ని కర్మలకు సంబంధించియుండగా, అక్కడేగల జ్ఞాన చిహ్నములన్నీ కర్మాధీనములుగావు. అందువలన కర్మాతీతమైన వాటిని గురించి ఖచ్చితముగా చెప్పుటకు వీలుపడదు. ఈ మూడు స్థానముల వలన భూమిమీద జ్ఞానిని గుర్తించవచ్చును. అయితే అతనిలో ఎంత జ్ఞానముండేది తేల్చి చెప్పలేము. క్రింద 45వ చిత్రపటములో కర్మచక్రము లోని 9,10,11 స్థానముల కర్మలను చూడవచ్చును.


45వ చిత్రపటము