పుట:Jyothishya shastramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంతవరకు కర్మచక్రములో మొత్తము ఏడు స్థానములలోని కర్మ తెలిసిపోయినది. అంగీ భాగములోని నాల్గవ కేంద్రస్థానమును ఆధారము చేసుకొని మూడు, ఐదు స్థానములలోని కర్మలను తెలుసుకొన్నాము. ఇప్పుడు అర్ధాంగి భాగములో కేంద్రమైన పదవస్థానమును ఆధారము చేసుకొని దానికిరువైపులనున్న 9,11 స్థానములలోని కర్మలను తెలుసుకొందాము. 9,11 స్థానములలోని కర్మలను కష్టము లేకుండా సులభముగా తెలియ వచ్చును. అదెలా అనగా అంగీ భాగమునకు కేంద్రమైన 4వ స్థానములో స్థూల ఆస్తులుండగా, అర్ధాంగి భాగమునకు కేంద్రమైన 10వ స్థానములో నాల్గవ స్థానమునకు వ్యతిరేఖమైన సూక్ష్మఆస్తులైన కీర్తిప్రతిష్ఠ, వృత్తి ఉద్యోగ కర్మలను గ్రహించవచ్చును. స్థూల ఆస్తులు ప్రపంచ సంబంధమైనవి కాగా, జ్ఞానధనము, జ్ఞానమార్గము సూక్ష్మ ఆస్తులు పరమాత్మ సంబంధమైనవి. ఈ విధముగా అంగీ భాగములోనున్న కర్మకు పూర్తి భిన్నముగా అర్ధాంగి భాగములోగల కర్మలుండును. మొదటి భాగములో కేంద్రమైన నాల్గవ స్థానమునకు రెండవ భాగములో కేంద్రమైన పదవస్థానము వ్యతిరేఖమైనట్లే, అంగీ భాగములోని మూడవ స్థానములోని కర్మకు వ్యతిరేఖమైన కర్మ అర్ధాంగి భాగములోని తొమ్మిదవ స్థానములో ఉండును. అలాగే అంగీ భాగములోని ఐదవ స్థానములోని కర్మకు వ్యతిరేఖమైన కర్మ అర్ధాంగి భాగములోని పదకొండో స్థానములో ఉండును. మూడవ స్థానములో ప్రపంచ ధనమునకు సంబంధించిన పాపముండగా దానికి పూర్తి వ్యతిరేఖ స్థానమైన తొమ్మిదవ స్థానమున పరమాత్మ ధనము (జ్ఞానశక్తి) నకు సంబంధించినది లభించును. అదే విధముగా ఐదవ స్థానములో ప్రపంచ సంబంధ జ్ఞానముండగా దానికి వ్యతిరేఖ స్థానమైన పదకొండో స్థానములో పరమాత్మ జ్ఞానము (దైవజ్ఞానము) నకు సంబంధించిన గ్రాహిత