పుట:Jyothishya shastramu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకటి మనిషికున్న ఆస్తి, రెండవది మనిషికున్న పేరు ప్రతిష్ఠలు. మనిషికున్న ఆస్తినిబట్టి మనిషికి గౌరవముగానీ, అగౌరవముగానీ ఉండును. అలాగే మనిషికున్న పేరుప్రతిష్టలను బట్టి కూడా గౌరవ అగౌరవములుండును. అందువలన ఇటు ఆస్తి, అటు కీర్తి మనిషి జీవితములో ముఖ్యమైనవనీ, అవియే మనిషి జీవితములో కర్మ కేంద్రములని చెప్పవచ్చును. మనిషికి గల ఆస్తి యొక్క కర్మనుబట్టి, అలాగే కీర్తినిబట్టి మిగతా కర్మలన్నియు మిగతా ఎనిమిది స్థానములలో చేర్చబడియుండును. అందువలన మిగతా ఎనిమిది స్థానముల కర్మలకు 4, 10 స్థానములే కేంద్రములుగాయున్నవని చెప్ప వచ్చును. క్రిందగల 38వ చిత్రపటములో అర్ధాంగి భాగములో 10వ స్థానమును కేంద్రముగా చూడవచ్చును.

పై రెండు చిత్రపటములలో 4,10 స్థానములు కేంద్రములుగా కనిపించుచున్నవి. ఇదంతయు మన తలలోని కర్మచక్రములోనున్న