పుట:Jyothishya shastramu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నది. ఏ జ్యోతిష్యుడైనా మనిషిలోని కర్మనే లెక్కించి చూచి వాని భవిష్యత్తు కొంతవరకు తెలియవచ్చును. జ్యోతిష్యము అంతయు జ్యోతితో ముడిపడి యున్నది. కావున జ్ఞానము (జ్యోతి) తెలియనివాడు సరియైన జ్యోతిష్యుడు కాడు. జ్ఞానమును తెలియుట వలననే కర్మలూ, వాటి బాధలూ తెలియును. దానినిబట్టి జ్యోతిష్యమును తెలియవచ్చును.

25. అంగీ, అర్థాంగి

జ్ఞానమునుబట్టి ఏ కర్మ ఎక్కడ చేరుచున్నదో తెలియకున్నా, అది అంతయు జ్యోతిష్యశాస్త్రమునుబట్టి తెలియును. బ్రహ్మవిద్యా శాస్త్రమును బట్టి ఏ కర్మ ఎంత తీవ్రమైనదో, దానివలన బాధ ఎంత తీక్షణముగా ఉండునో, దానిని అనుభవించకుండా తప్పించుకొనుటకు దారి ఏదో తెలియును. బ్రహ్మవిద్యా శాస్త్రముతో అనుసంధానమైనది జ్యోతిష్య శాస్త్రము. అందువలన బ్రహ్మవిద్యా శాస్త్ర సంబంధముతోనే మనిషి కర్మచక్రములో (కర్మపత్రములో) ఏ కర్మ ఎక్కడ లిఖితమైనదో తెలుసుకొందాము. మనిషి జననముతో అతని జీవితము ప్రారంభమగుచున్నది. తర్వాత ఎంతో కొంత కాలమునకు మనిషికి సంభవించు మరణముతోనే అతని జీవితము అంత్య మగుచున్నది. జీవితములో ఇటు మొదలు అటు అంత్యమునకు పుట్టుక చావులు రెండూ అందరికీ తెలిసిన సంఘటనలే. వాటి వివరము కర్మ రూపములో ఉండకపోయినా ఎక్కడినుండి కార్యములు మొదలగునో, ఎక్కడ అంత్యమగునో దానికి సంబంధించిన కర్మలు కర్మచక్రములో లిఖితమైనవి. కర్మచక్రములో పన్నెండు స్థానములుండగా, అందులో జీవిత ప్రారంభకర్మ మొదటిదైన ఒకటవ స్థానములోనూ, అలాగే జీవిత అంత్యము లోని కర్మ చివరిదైన పన్నెండవ స్థానములోనూ వ్రాయబడియుండును.