పుట:Jyothishya shastramu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మ నుండి తప్పించుకోలేక దానిని తగిలించుకుంటు న్నాడు. గుణరహిత భాగమైన నాల్గవభాగములో గుణములులేవు. కావున దానిని బ్రహ్మయోగమని చెప్పవచ్చును. బ్రహ్మయోగమున జీవుడున్నప్పుడు కర్మ ఆచరణలేదు. అలాగే గుణ ఆలోచన లేదు. మొత్తానికి కర్మేలేదు. కావున కర్మలేని భాగమైన నాల్గవభాగమే గుణచక్రములో మంచిదని చెప్పవచ్చును.

24. కర్మచక్రములో ఏ కర్మ ఎక్కడ చేరుతుంది?

నాలుగు చక్రముల సముదాయము ప్రతి మానవుని శిరస్సులో కలదు. నాలుగు చక్రములకు ఆధారమైన ఆత్మ తలనుండి వీపు క్రింది భాగము వరకు వ్యాపించియున్న బ్రహ్మనాడిలో (పెద్ద నరములో) కలదు. పై చక్రము దేవునికి సంబంధించినది, కావున ప్రతిమారు దానిని చెప్ప నవసరము లేదు. అందువలన పై చక్రమును వదలి మనిషికి సంబంధించిన మూడు చక్రములనే చెప్పుకొందాము. కాల, కర్మ, గుణ చక్రములు మూడుయున్నా వాటిలో ఎక్కువ ప్రాధాన్యత గలది కర్మచక్రమని చెప్పుకొన్నాము. అటు కాలచక్రము ఇటు గుణచక్రముల మధ్యన కర్మచక్రము యుండి ప్రాధాన్యత కల్గియున్న దానివలన, ఇతర మతగ్రంథములని పేరు గాంచిన మూల గ్రంథములలో కూడా కర్మచక్ర ప్రస్థావన వచ్చినది. ఇక్కడ కర్మచక్రమని దేనినంటున్నామో దానినే కర్మపత్రమని మూల గ్రంథములలో చెప్పారు. మంచి చెడులున్న కర్మపత్రాన్ని మనిషి మెడలో వ్రేలాడదీశామని 17వ సురా, 13వ ఆయత్లో ఖుర్ఆన్ గ్రంథములో చెప్పబడినది. అక్కడ పాప పుణ్యములను చెడు మంచిలని చెప్పారు. అంతేగాక తలలో నాల్గుచక్రములు క్రిందికి బ్రహ్మనాడిగా వ్రేలాడబడియుండడమును