పుట:Jyothishya shastramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృశ్చిక, ధనుస్సు లగ్నములకు శాశ్వితముగా మిత్రు శత్రు వర్గములుగానున్న గ్రహములను వరుసగా క్రింద చూడవచ్చును.

పండ్రెండు గ్రహములు ఆరుకు ఆరు మిత్రు, శత్రువులుగా ఉండడమే కాక వీరిలో ప్రత్యేకముగా ఒక గ్రహమునకు ఒక గ్రహము బద్దశత్రుత్వము కల్గియున్నది. ఆ విషయమును తర్వాత తెలిపెదము.

19. మకరము

ఇపుడు మకర లగ్నమునకు ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తర్వాత పేజీలోని 21వ పటములో చూచెదము.

మకర లగ్నమునకు అదే లగ్నాధిపతియైన రాహువు, ప్రక్కనేగల కుంభ లగ్నాధిపతియైన శని మిత్రులు కాగా, మరియు వృషభ లగ్నాధిపతియైన మిత్రగ్రహము, మిథున లగ్నాధిపతియైన చిత్రగ్రహము, కన్యా లగ్నాధిపతి యైన బుధ గ్రహము, తులా లగ్నాధిపతియైన శుక్రగ్రహము