పుట:Jyothishya shastramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
కాలచక్రము - 16వ పటము

యొక్క ఆ సంఖ్యను లగ్నముగా గుర్తించుకొని, పైన పటములో గల కాలచక్రములోని ద్వాదశ గ్రహములు ఎక్కడెక్కడ గలవో అక్కడనే గుర్తించుకొని చూడడమును పూర్వము ‘జాఫతకము’ అనెడివారు. దానినే ఈ కాలములో ‘జాతకము’ లేక ‘జన్మలగ్నము’ అంటున్నాము. ఆ రకముగా గుర్తించినపుడు జన్మలగ్నము మేష భాగము అయితే దానిని మేషలగ్నము అంటున్నాము. మేష లగ్నమునకు 2:1 ప్రకారము శాశ్వితముగా (12) ద్వాదశ స్థానాధిపతి గురువు, (1) ప్రథమ స్థానాధిపతి యగు కుజుడు మరియు (4) చతుర్థ స్థానాధిపతియు (5) పంచమ స్థానాధిపతియగు చంద్ర, సూర్యులు, అలాగే (8) అష్టమ, (9) నవమ స్థానాధిపతులగు భూమి, కేతువులు మిత్రులగుదురు. శాశ్వితముగా మేషలగ్నమునకు గురు, కుజ, చంద్ర, సూర్య, భూమి, కేతువను ఆరు గ్రహములు మిత్రుగ్రహములని చెప్పవచ్చును.