పుట:Jyothishya shastramu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూస్తే జీవుని ఆకారము ఈ విధముగా గలదు. జీవుడు మూడు పొరల మధ్యన బంధింపబడిన ఖాళీ స్థలము అని తెలియుచున్నది. జీవుని ఆకారమును క్రింది 12వ పటములో చూడవచ్చును.

జీవుని ఆకారము - 12వ పటము

ఇంతవరకు కాలచక్రమును, కర్మచక్రమును, గుణచక్రమును అందులోనున్న జీవున్ని గూర్చి తెలుసుకొన్నాము. ఇక మూడు చక్రములకంటే పైన గల బ్రహ్మచక్రమొకటి గలదు. బ్రహ్మచక్ర వివరము ఇక్కడ జ్యోతిష్యమునకు అవసరము లేదు. అది ఒక బ్రహ్మవిద్యాశాస్త్రమునకు మాత్రమే పరిమితమైనది. కావున రెండు భాగములుగానున్న బ్రహ్మచక్రమును ఇక్కడ వివరించుకోక వదలి వేయుచున్నాము. జ్యోతిష్యమునకు కావలసినది కాల, కర్మ, గుణచక్రముల సమగ్ర సమాచారము మాత్రమేనని తెలుపు చున్నాము. గుణచక్రములోని గుణములను, జీవున్ని గురించి తెలుసు కొన్నాము. కర్మచక్రములోని కర్మను గురించి తెలుసుకొన్నాము. కానీ కాలచక్రములో గ్రహములను గురించి తెలుసుకోవడములో కొంత మిగిలి ఉన్నది.