పుట:Jyothishya shastramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విధముగా జీవుడు మూడు గుణముల భాగములను మారుటకు ఒక కారణము కలదు. అదేమనగా! ప్రారబ్ధకర్మను బట్టి జీవుడు అస్వతంత్రుడై గుణముల భాగములను మారవలసియున్నది. ఆ విధముగా మారుచున్న జీవుడు ఒక్క సమయములో, ఒక్క గుణభాగములో, ఒక్క గుణమునందు లగ్నమగుచుండును. ఏ గుణ భాగములోనున్న జీవున్ని ఆ గుణభాగము పేరుతో పిలువడము జరుగుచున్నది. తామస భాగములోనున్నపుడు తామసుడనీ, రాజస భాగములోనున్నపుడు రాజసుడునీ, సాత్త్విక భాగములో నున్నపుడు సాత్త్వికుడనీ పిలుస్తున్నాము. ఇపుడు సాత్త్వికములోనున్న సాత్త్వికుణ్ణి క్రింది 11వ పటములో చూస్తాము.

గుణచక్రము - 11వ పటము

జ్ఞానదృష్ఠితో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను నాల్గుచక్రముల చట్రమును చూడవచ్చును. అదే విధముగ క్రింద గుణచక్రములోని ఏదో ఒక భాగములోనున్న జీవున్ని చూడవచ్చును. దీనినిబట్టి గుణములకూ, జీవునికీ కూడ ఆకారము కలదని తెలియుచున్నది. ఇంతవరకు, భూమిమీద ఎక్కడా తెలియని విధానమునూ, గుణముల యొక్కయు మరియు జీవుని యొక్కయు ఆకారములనూ మనము తెలుసుకోగలిగాము. సమగ్రముగా