పుట:Jyothishya shastramu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కదా! అట్లే వీరు కూడా వీరి రక్తమే కార్చి చనిపోయారు కదా! అటువంటప్పుడు వీరివలన ఏమీ ప్రయోజనముండదా? ఎప్పుడో రెండు వేల సంవత్సరముల పూర్వము చనిపోయిన ఏసువలన ఇప్పుడు కూడా పాపాలు పోతాయి పాపక్షమాపణకే రక్తము కార్చినదని అంటున్నారు కదా! అలాంటప్పుడు లేటెస్టుగా ఇప్పుడే చనిపోయిన వారి రక్తము వలన మన పాపము పోదా?

జ॥ ఏసు తన రక్తము ద్వారా మీ పాపములు పోతాయి అని ఎక్కడా చెప్పలేదు. ఒకచోట నా నిబంధన రక్తము అని ఉచ్చరించాడు. ఆ మాట జ్ఞానమును గురించి అనినమాటగానీ వేరుకాదు. ఏసు విషయములో క్రైస్తవులందరూ పొరపాటుపడినారు. ఇకపోతే మహాత్మాగాంధీగారు గానీ, రాజీవ్‌గాంధీగారుగానీ వారి కర్మవలన గ్రహచారము బాగాలేక పోయారు. వారిని చంపిన పాపము చంపిన వారికి వచ్చియుంటుంది. అంతేగానీ పాపముపోయివుండదు. ఇద్దరూ కర్మవలనే చనిపోయారు అనుటకు పూర్తి ఆధారములున్నవి. ఇంకా ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! ఇద్దరూ కుజగ్రహము యొక్క ప్రథమశ్రేణి ఆయుధము చేతనే చనిపోవడము జరిగినది. రాజీవ్‌గాంధీగారి జాతకచక్రమును చూచారు. మహాత్మాగాంధీగారి జాతకము బహుశా ఎవరికీ తెలియదను కొంటాను. ఇప్పుడు మరణమును గురించిన కర్మసమస్య వచ్చినది కాబట్టి, ఒకమారు రెండు జాతకములను పరిశీలించి చూద్దాము.