పుట:Jyothishya shastramu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భగవద్గీతను చదవండియని మేము ఎంతో ఖర్చుపెట్టి గోడలమీద వ్రాయిస్తే దాని కారణముతో కేసుపెట్టి కోర్టుకీడ్చి 20 రోజులు జైలుశిక్ష వేయించిన వారున్నారు. ఆ దినము కోర్టులో ఇది తప్పా ఒప్పాయని చూడకుండా, ఏమాత్రము ఆలోచించకుండా తీర్పు చెప్పి జైలుకుపంపిన జడ్జిని కూడా జ్ఞానము గుర్తుపెట్టుకొనియున్నది. ముందు తరములో జ్ఞానదూషణ చేసిన వారందరూ బస్సులో కాలిపోవడము జరిగినది. ఈ తరములో జ్ఞానదూషణ చేసినవారు మహనంది, గుంతకల్లు, హైదరాబాద్‌, భువనగిరి, కడపలో దేవుని దృష్ఠియందు నమోదు చేయబడియున్నారు. నేడు హిందూధర్మ రక్షణ చేయువారమనువారే ఎక్కువ గుర్తింపబడినారు. మేము వ్రాసినది ఏమున్నదని చూడకుండ జ్ఞానమును హేళనగా మాట్లాడినప్పుడు దేవునికి కోపము రాదా! ఎంతోమంది జ్ఞానులైన హిందువులు ఇది గొప్ప జ్ఞానము మా అదృష్టముకొద్దీ ఇంతకాలమునకు దొరికింది అని సంతోషిస్తూవుంటే హిందూధర్మములంటే ఏమిటో తెలియని మూర్ఖులు మేము హిందూ రక్షకులమని చెప్పుచూ, ఏ జ్ఞానమూ తెలియనివారై జ్ఞానమును గురించీ, గ్రంథరూపములలోయున్న జ్ఞానమును గురించీ దూషించి మాట్లాడితే అది ప్రత్యేకమైన కర్మాతీత పాపముకాక ఏమౌతుంది. భగవద్గీతలో క్షరాక్షర పురుషోత్తములుగా దేవుడు తనను గూర్చి వర్ణించి చెప్పితే, త్రైత సిద్ధాంతము ద్వారా ఆ విషయమును మేము చెప్పినప్పుడు ఇది అద్వైతము, ద్వైతములాగ త్రైతము హిందూమతములోనిదే అను పరిజ్ఞానము లేకుండా త్రైత సిద్ధాంత భగవద్గీతను మేము ఒప్పుకోము అని కాల్చినవారిని మేము భక్తిపరులమే అంటే దేవుడు ఒప్పుకుంటాడా! జ్ఞానము అంటే ఏమిటి అది ఎంత శక్తివంతమైనదని ఏమాత్రము తెలియకుండా మేము మంచివారమే మేము హిందూ రక్షకులమే అంటే దేవుడు ఒప్పుకుంటాడా? అంతటా నిండియున్న