పుట:Jyothishya shastramu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎందుకు దూషిస్తాడు మీరు చెప్పునదంతా అసత్యము అని కొందరూ అడుగ వచ్చును. వారు ఎప్పుడు దూషించినదీ, ఎలా దూషించినదీ నాకు కూడా తెలియదు. కానీ దూషించినది మాత్రము వాస్తవమే. నా మాట సత్యమను టకు ఇప్పుడు ప్రస్తుతము అటువంటి పాపము చేసుకొన్న వారిని గురించి చెప్పుతాను వినండి. దేవుని మీద విశ్వాసముగలవారు, ధర్మరక్షకులైన వారు, నిత్యము భక్తితో ఏదో ఒక దేవున్ని పూజించేవారూ నేడు దైవజ్ఞాన దూషణ చేస్తూ అటువంటి పనిని మేము చేస్తామా? మేము చేసినదంతా మంచిదే అని అనుకొంటున్నారు. అయినా అటువంటివారు ఇప్పటికే చాలామంది వారు దైవజ్ఞానమునకు వ్యతిరేఖులైయున్నారు. అటువంటి వారందరికీ ఎప్పుడో ఒకమారు చెప్పకనే జరిగిన బస్సు ప్రమాదములాగ ఏదో ఒక ప్రమాదము జరుగును. అప్పుడు వారందరూ అక్కడ జమకూడుదురని మాకు తెలుసు, దేవునికి తెలుసు ఎవరు ఏమీ తప్పు చేసినది. అందువలన ఎవరినీ దేవుడు కాపాడలేదు. తనకే వ్యతిరేఖులైనవారిని ఆయన ఎందుకు కాపాడును? ప్రస్తుత కాలములో దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పిన భగవద్గీతను కాలితో తన్ని నడిరోడ్డులో అగ్గిపెట్టి కాల్చినవారు దైవభక్తి కలవారే. మేము సృష్ఠికర్త కోడ్‌ యని భగవద్గీతలో 15వ అధ్యాయమున 16,17 శ్లోకముల నంబర్లను కూడా వ్రాసి ‘‘9 6 3’’ అని గోడలమీద వ్రాస్తే ఇది క్రైస్తవులదని దానిమీద మలము చల్లినవారుగలరు. మేము (మా భక్తుల బృందము) భగవద్గీతనూ దానికి అనుబంధమైన గ్రంథములనూ ఇల్లిల్లూ తిరిగి భగవద్గీతా ప్రచారము చేస్తే క్రైస్తవులు తప్ప హిందువులు ఇట్లా తిరుగరు మీరు భగవద్గీత ముసుగులో క్రైస్తవమును ప్రచారము చేస్తున్నారని దూషించి ఆ ఊరినుండి పొమ్మని, పోకపోతే మీ బుక్కులను కాల్చివేస్తాము, మిమ్ములను తంతామనినవారు కూడా కలరు. త్రైత సిద్ధాంత