పుట:Jyothishya shastramu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నారో చెప్పకపోవడము, మరియు రవి,శని,కుజులు, ఏ లగ్నమునకు కౄరులో, ఎట్లు కౄరులైనారో చెప్పకపోవడము పూర్తి అశాస్త్రీయత అని చెప్పవచ్చును. మేము 2 :1 అను ఆత్మల సూత్రమును అనుసరించి గ్రహములను రెండు గుంపులుగా చేశాము. వాటినే గురువర్గము, శని వర్గము అని కూడా చెప్పాము. శని, బుధ, శుక్ర, రాహువులను ఒక గుంపులో; సూర్య, చంద్ర, కుజ, గురు, కేతులను ఒక గుంపులో ఉన్నాయని మేము చెప్పితే జ్యోతి తెలియనివారు రెండు గుంపులలోని వారిని కలుపుకొని సూర్య, కుజ, శని, రాహు,కేతులను కౄరులన్నారు. ఇందులో మా లెక్కప్రకారము సూర్య, కుజ, కేతువులు గురువర్గములోనివారు కాగా, ఈ ముగ్గురిలో ప్రతిపక్ష గుంపులోని రాహువు,శని కలిసిపోవడము పూర్తి తప్పు. అంతేకాక 1×7 అను సూత్రము ప్రకారము సూర్యునకు బద్ద శత్రువు శని అగును. అలాగే శనికి బద్దశత్రువు సూర్యుడగును. అటువంటివారు ఒక గుంపులో కౄరులుగా ఉన్నారని చెప్పడము అసంబద్దము, అశాస్త్రీయము. అందువలన సంస్కృత శ్లోకములోనున్న తప్పుడు సమాచారమును నమ్మ వద్దండి. ఇటువంటి అశాస్త్రీయత జ్యోతిష్యములో కనిపిస్తున్నది. కావున నేటి హేతువాదులు, నాస్తికవాదులు జ్యోతిష్యము శాస్త్రము కాదంటున్నారు. టీవీ9 వారు జ్యోతిష్యము మూఢనమ్మకము అంటున్నారు. అందువలన మేము పూర్తి శాస్త్రీయతతో ఈ గ్రంథమును వ్రాసి, జ్యోతిష్యశాస్త్రము షట్‌శాస్త్రములలో ఐదవశాస్త్రమని చెప్పుచున్నాము.


13) ఇంతవరకు చెప్పిన అతిరథులు, మహారథులు గ్రహములు తొమ్మిదే అని చెప్పగా, ఎవరూ చెప్పని మూడు గ్రహములను మీరు చెప్పారు. మీరు ఎక్కడా ఎవరికీ జ్యోతిష్యము చెప్పినది కూడలేదు. భవిష్యత్తు (జ్యోతిష్యము) చెప్పు అనుభవముగానీ, అలవాటుగానీ లేని మీరు ఏకంగా ద్వాదశ