పుట:Jyothishya shastramu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావున సూత్రబద్దత కల్గియున్నది. 2:1 అను సూత్రము ప్రకారము, మిత్రులు శత్రువులు అను రెండు వర్గములను విభజించాము. దానిప్రకారము ఒకనికి మిత్రులైన గ్రహములు మరొకనికి శత్రువులు కావచ్చును. ఆరు లగ్నములకు శత్రువులై, కౄరులుగా వర్తించు గ్రహములు, మరొక ఆరు లగ్నములకు మిత్రులై, సౌమ్యులుగా వర్తించుచున్నారు. ఒక శాస్త్రమును అనుసరించి, అందులోనూ ఒక సూత్రమును అనుసరించి ఎవరు ఎవరికి సౌమ్యులో, ఎవరు ఎవరికి కౄరులో మేము వివరించి చెప్పాము. అట్లుకాక ఏ లగ్నమునూ ఆధారము చేసుకొని చూడక, ఏ సూత్రమునూ అనుసరించకుండ రవి, శని, కుజ, రాహు, కేతువులను కౄరులనడము, గురు, బుధ, శుక్ర, చంద్రులను సౌమ్యులు అనడము పూర్తి శాస్త్రవిరుద్ధమని చెప్పుచున్నాము. సంస్కృతములో ఇష్టమొచ్చినట్లు శ్లోకములను అల్లి చెప్పినంతమాత్రమున అందులో శాస్త్రీయత లేకపోతే అది వాస్తవము కాదు. ఇక్కడొక ఉదాహరణను చూస్తాము.

శ్లో॥ దుఃఖావహా ధనవిశాకరాః ప్రధిష్టా విత్తస్థితా రవిశనైశ్చర భూమిపుత్రాః
చంద్రోబుద్దస్సుర గురుర్భృగునందనోవా, సర్వేధనస్య నిచయల కురుదే ధనస్థాః


తాత్పర్యము : ద్వితీయ స్థానములో రవి,శని,కుజులలో ఎవరున్ననూ ధననాశనమును, అధికదుఃఖమును కల్గించి బాధింతురు. చంద్ర,బుధ, శుక్రులలో ఏ ఒక్కరున్ననూ ధనలాభమును కలిగింతురు.

ఈ శ్లోకమూ దాని తాత్పర్యమూ ‘‘యవన జాతకము’’ అను పుస్తకములో వ్రాయబడియున్నది. ఇందులో మేము అడుగునదేమనగా! ద్వితీయమున చెడు గ్రహములుంటే, ధన నాశనము దుఃఖము కల్గుననుట ఒప్పుకుంటాను. కానీ ఏ లగ్నము ద్వితీయమున వీరు చెప్పిన గ్రహములు