పుట:Jyothishya shastramu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పిన దేవునిమాట వాస్తవము. ఏ రహస్యమైనా మన శరీరములోనున్న ఆత్మకే తెలుసు.

ఆత్మ అందరినీ నడిపించుచూ ఇటు జీవునిగా అటు దేవునిగా భ్రమింపజేయుచూ, తాను మాత్రము ఎవరికీ తెలియక నిశ్శబ్ధముగా యున్నది. అన్నిటికీ అధిపతియైన దేవుడు తనకు మనకు మధ్యలో ఆత్మనుంచి సాక్షిగా వినోదమును చూస్తున్నాడు. ఎలాగైతేనేమి, అన్నీ తెలుసుననుకొన్న జీవునికీ ఏమీ తెలియదని నిజంగా ఏ జీవునికీ తెలియదు. అందువలన కాలము ఎవరికీ తెలియదు. అట్లే కర్మ కనిపించడము లేదు. జీవుడు, గుణములను స్వయముగా ఎవరూ చూడలేదు. మేము చూపితే మీరు చూడగలిగారు, మేము చెప్పితే వినగలిగారు. అంతేగాని దేవుని మాట ప్రకారము మేము తప్ప ఎవరూ స్వయముగా చూడలేదని చెప్ప వచ్చును.

11) మాకు జ్యోతిష్యము తెలియాలంటే ఈ గ్రంథము చదివితే అర్థమవు తుందా?

జ॥ సహజముగా ఎవరి గ్రంథమును వారు గొప్పగా చెప్పుకొందురు. అందువలన ఈ గ్రంథము చదివితే బాగా అర్థమవుతుందని నేను చెప్పినా, అది అర్థమగుటకూ, అర్థము కాకుండుటకూ ఒక విధానమును అనుసరించి చూస్తే ద్వాదశ గ్రహములలో ఒక బుధగ్రహము అనుకూలము లేనప్పుడు జ్యోతిష్యము అర్థముకాదు. బుధగ్రహము జన్మ లగ్నమున అనుకూలమైన మిత్ర గ్రహమై ఐదవస్థానములో ఉన్నా, తన చేతితో తాకినా, అటువంటి జాతకునికి జ్యోతిష్యము మీద ఆసక్తికల్గి దానిని తెలియునట్లు చేయును. ఆసక్తి పెరుగుకొద్దీ జ్యోతిష్య శాస్త్రము అర్థమగుచూవచ్చును. ఏదీ ఒక్కమారు రాదు కాలక్రమేపీ రాగలదు.