పుట:Jyothishya shastramu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1991 మే, 21 తేది సరిగా మంగళవారమే కావడము విశేషము. గ్రహములలో కుజున్ని అంగారకుడనీ, మంగళుడనీ అనుచున్నాము. దినములలో మంగళవారము కుజుని దినమని చెప్పుచున్నాము. కుజుడు తన దినమైన మంగళవారమే రాజీవ్‌గాంధీని చంపడము జరిగినది. మంగళవారమే చని పోవడము వలన ఆ దిన అధిపతి అయిన కుజ గ్రహము వలన ఆ సంఘటన జరిగినదని తెలియుచున్నది. మరియొక విషయమేమనగా తులాలగ్న జాతకుడైన రాజీవ్‌గాంధీగారికి శత్రు గ్రహములుగా ఐదు గ్రహములు కలవు. అవి వరుసగా 1) సూర్యుడు 2) చంద్రుడు 3) కుజుడు 4) గురువు 5) కేతు గ్రహములు. ఈ ఐదుమంది గుంపుకు గురువు నాయకుడుగా ఉన్నాడు. ఈ శత్రు గుంపులోని గురువు, కుజుడు ఇద్దరూ కర్కాటక రాశిలో ఉండి కుజుడు శరీరస్థానమైన మొదటి స్థానమును చూచి శరీరమును నాశనము చేశారు. ఆ సంఘటన రాత్రి 10-21 నిమిషములకు జరిగినది. ఇక్కడ శత్రుగుంపులోని గురు, కుజులే కాక మరొక శత్రు గ్రహము ఆ లగ్నములోనికి వచ్చియున్నది. అప్పుడు ఒకే వర్గమునకు చెందిన మూడు గ్రహములు కటక లగ్నములో ఉండుట వలన వారికి ఎదురుగాయున్న మకర లగ్నములోని శనిని తాకి శనినుండి జాతకుని ఆయుష్షును లాగుకొన్నారు. సూర్యోదయములో ధనుర్‌లగ్నము మీదగల సూర్యుడు రెండు గంటలకు ఒక లగ్నమును దాటుచూ వచ్చి రాత్రి 9-25 నిమిషములనుండి 11-37 నిమిషముల వరకు కటక లగ్నము (కర్కాటక లగ్నము) మీద ఉండుట వలన ప్రమాద సమయమునకు గురు, కుజులతో పాటు సూర్యుడు కూడా ఉన్నాడని తెలియుచున్నది. సూర్యుడు కర్కాటక లగ్నములో దాదాపు 2-12 నిమిషములున్నాడు. అయితే సూర్యుడు కటక లగ్నములోనికి వచ్చి గురు కుజులతో కలిసిన దాదాపు గంటలు