పుట:Jyothishya shastramu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ స్థానము మీద పెత్తనము చెలాయించు కుజగ్రహము గురువుతో కలిసి పదవ స్థానమున ఉన్నది. అక్కడున్న కుజగ్రహము గురువుతో కలిసి ఇద్దరూ శనిమీద వారి హస్తములనుంచి శని ఆధీనములోనున్న ఆయుష్షును కుజగ్రహము లాగుకోవడము జరిగినది. జాతకములో పుట్టినప్పుడే నిర్ణయించబడిన కర్మను పుట్టిన రోజు పంచాంగము ద్వారా తెలిసినా అది ఎప్పుడు జరుగుననుటకు అప్పుడు జవాబులేదు. అప్పటి పంచాంగము ద్వారా తెలియకున్నా ప్రస్తుత వర్తమాన కాలములోనున్న పంచాంగములో మాత్రము తెలియగలదు. ఆయుష్షు విషయములో అనుమానమున్నా అతని ఆయుష్షు ఎప్పుడు హరించివేయబడుతుందను విషయము ఆ సంఘటన జరుగుకాలము ఎప్పుడగునో అప్పటి పంచాంగములో ఆ సంఘటన వివరమునకు సంబంధించిన గ్రహచార ముండును. 1991వ సంవత్సర పంచాంగము మార్చి నెలలోనే లభించుట వలన ప్రమాదము జరిగి చనిపోకముందు రెండు నెలలముందు ఆ విషయము లగ్నకుండలిలో అర్థమగుచున్నది. ఆ సంవత్సరములో జరుగు ఘటన ఆ సంవత్సర పంచాంగములోనేయుండును.