పుట:Jyothishya shastramu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రితము భారత దేశములో అన్యమతములు ఎక్కువగా లేవు. అందరూ ఎక్కువగా హిందువులే ఉండెడివారు. ఆ కాలములో చదువు వచ్చిన ప్రతి ఇంటిలోనూ పంచాంగము ఉండెడిది. తమ ఇంటిలో ఎవరికి పేరు పెట్టాలన్నా, ఎవరికి పెళ్ళి చేయాలన్నా, ఎవరు ఎక్కడకు ప్రయాణము చేయాలన్నా, ప్రతి దానికి తమవద్ద యుండే పంచాంగమును తీసుకొని ఆ ఊరిలో ఉండే పురోహితుని వద్దకు పోయి పంచాంగమును చూపించి దేనికేది మంచిరోజో, ఏది చెడు రోజో తెలుసుకొనెడివారు. అంతేకాక విత్తనము వేయుటకు, నాగలి కట్టుటకు, ముఖ్యమైన ప్రతి పనికీ మంచి ముహూర్తము ఏదో తెలుసుకొనెడి వారు. ఈ విధముగా హిందువు అయినవాని ప్రతి ఇంటా పంచాంగము ఉండెడిది.

కాలక్రమేపి పంచాంగములు బ్రాహ్మణులకే పరిమితమైపోయాయి. నేడు చదువుకొంటున్న పిల్లలను పంచాంగమును గురించి అడిగితే అదేమిటో మాకు తెలియదని చెప్పుచున్నారు. పంచాంగము అను పేరు తెలియనివారు చాలామంది ఉన్నారు. వారికి బయటనున్న సూర్య చంద్ర గ్రహములు మాత్రము తెలుసుగానీ శరీరమున తలలోనున్న ద్వాదశ గ్రహములు తెలియవు. ఈ విధముగా నేడు చాలామంది పెద్దలకు కూడా పంచాంగమును గురించి తెలియకుండా పోయినది. పండుగలను గురించి తెలియాలన్నా తేదీలను గురించి తెలియాలన్నా అందరికీ నేడు క్యాలెండర్లు మాత్రము తెలుసు. క్యాలెండర్లలోనే తిథి, నక్షత్రములుండుట వలన అందరికీ క్యాలెండర్లు తెలియునని చెప్పవచ్చును. ఎక్కడైనా ఒకరో ఇద్దరో పంచాంగములు చూచేవారున్నప్పటికీ, నేడు కంప్యూటర్లలో జాతకములు కూడా సులభముగా తెలియుచుండుట వలన చివరకు బ్రాహ్మణులకు కూడా పంచాంగములు అవసరము లేకుండాపోయింది. ఇతర మతముల వారు