పుట:Jyothishya shastramu.pdf/280

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అను వ్యక్తి జాతకము అన్ని విధముల బాగున్నది. అయితే ఒక్క ఆయువు విషయములో మాత్రము రాజీవ్‌గాంధీ గారికున్నట్లే రెండవ స్థానము కుజ గ్రహముండడము విశేషము. రాజీవ్‌ జాతకములో కుజుడు శనిని తాకి చూచినట్లే, జగన్‌ జాతకములో కూడా కుజుడు శనిని తన చేతితో తాకుచున్నాడు. అంతేకాక తన గుంపు నాయకుడైన గురువుతో కుజుడు కలిసి ఎనిమిదవ స్థానములో ఉన్నారు. ఇట్లు అనేక ఆయువుకు సంబంధించి జగన్‌ జాతకములో రాజీవ్‌ జాతకములోని పోలికలు కలవు. ఇంచుమించు ఒకే స్థాయిని సూచించు కుజగ్రహ దోషములు ఉండుట వలన, ఈ జాతకునికి కూడ రాజీవ్‌గాంధీ పోలికలను, ఆయువు విషయములను చెప్పవచ్చును. ఒక్క ఆయువు విషయములో భయమును కల్గించు కారణములు కన్పించునప్పుడు వాటిని తప్పించుకొనుటకు భగవద్గీతలో జ్ఞానయోగమున 37వ శ్లోకము చెప్పినట్లు ఒక్క జ్ఞానము వలననే సాధ్యమగును. జ్ఞానములేనివాడు కర్మలను అనుభవింపక తప్పదు.

నేడు జ్యోతిష్యము శాస్త్రముకాదు అను వాదనను త్రోసిపుచ్చి జ్యోతిష్యము ఆరు శాస్త్రములలో ఒక శాస్త్రమని నిరూపించి చెప్పుటకు జ్యోతిష్యగ్రంథమును వ్రాశాము. మా జ్యోతిష్యమునకు ఉదాహరణగా జగన్‌ అను వ్యక్తి జాతకమును వ్రాస్తూ అందులోని ఆయుష్షు లోపమును చూపించడము జరిగినది. అతని (జగన్‌) జాతకమునకు ఉదాహరణగా ఏకంగా రాజీవ్‌గాంధీగారి జాతకమును చూపవలసివచ్చినది. జ్యోతిష్యము శాస్త్రమని చెప్పుటకు జ్యోతిష్యము ప్రకారము మేము ఐదు సంవత్సరముల ముందే అంచనా వేసుకొన్నట్లు రాజీవ్‌గాంధీ మరణము జరిగిపోయినది. అందువలన అదే స్థాయి ప్రమాదమును చూపుచున్న జాతకుడు జగన్‌ దైవజ్ఞానమును పొందితే అతని దశాచారములో ఆ కర్మ తప్పిపోవుటకు అవకాశము గలదు. లేకపోతే ఘోర ప్రమాదమును చవిచూడవలసి వస్తుంది.