పుట:Jyothishya shastramu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాతకలగ్నములో అన్ని విషయములు బాగున్నా ఒక ఆయుష్షు విషయములో మేము చెప్పిన లోపములున్నవి. జాతక లగ్నములో తులా లగ్నము శరీర స్థానమైన మొదటి స్థానమైనది. తులా లగ్నమును అనుసరించి అన్ని విషయములు అన్ని విధముల బాగున్నాయి. ఒక్క ఆయుస్థానమొకటి బాగాలేదు, ఆ స్థానమును తాకినవాడు బాగాలేడు. ఈ జాతకము పుట్టినది 20వ తేదీ, ఆగష్టు, 1944వ సంవత్సరము. ఈయన దేశానికి ప్రధానిగా యున్న రాజీవ్‌గాంధీ. జాఫతకములో అనుమానములున్నట్లు 21 మే నెల, 1991వ సంవత్సరము తమిళనాడులో బాంబు ప్రేలుడు వలన చనిపోవడము జరిగినది. కుజగ్రహము ఎక్కడ చూచితే అక్కడ రక్తసిక్త మగును. అదే విధముగా ఘోర ప్రమాదమును కుజగ్రహమే చేసినది. ఆ దినము గురువు కుజునితో కలియుట వలన కుజునికి ఎక్కువ బలమైనది. కుజ గురువులు కర్కాటకములో కలియుట వలన, గురుగ్రహము తన ఐదింటి హస్తములను జాతకుని తన భాగమైన తులాలగ్నమును తాకుట వలన ప్రమాదములో శరీరము గుర్తించలేనంతగా ఛిద్రమైపోయినది. ఈ విధముగా కుజగ్రహము యొక్క కౄరత్వమును మేము ముందే ఊహించినా ఊహించినట్లే చివరకు జరిగిపోయినది.

అత్యంత ఉన్నత స్థానమైన సుప్రీమ్‌కోర్టు ఒక జడ్జిమెంట్‌ను విడుదల చేసిన తర్వాత ఆ జడ్జిమెంట్‌ను ఆధారము చేసుకొని అటువంటి కేసులను మిగతా కోర్టులలో వాదించడముగానీ, తీర్పు చెప్పడముగానీ జరుగుచున్నది. అలాగే దేశ ప్రధానిగా యున్న రాజీవ్‌గాంధీ జాతకమును మరణమును చూచిన తర్వాత అది ఒక సుప్రీమ్‌ జడ్జిమెంట్‌లాగా దానిని ఆధారము చేసుకొని అటువంటి జాతకములను గురించి చెప్పుకోవడము మంచిదే. ఎందుకనగా గ్రహచారములో ఎట్లుంటే అట్లే జరుగును. కావున జగన్‌