పుట:Jyothishya shastramu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందువలన గ్రహముల వలన వచ్చు ఆచరణలను గ్రహచారము అని అంటున్నాము. గ్రహచారము అను పదమును విడదీసి చూచితే గ్రహము+ ఆచరణ=గ్రహాచరణ అనవచ్చును. అట్లే దశ+ఆచారము=దశాచారము అని అనవచ్చును. గ్రహచారములో గ్రహముల ఆచరణ తప్ప ఏమీలేదని తెలియవలెను.

దశాచారము అను పేరు విభజించి చూస్తే దశ+ఆచారము అని తెలియుచున్నది. దశ అంటే పదియని అందరికీ తెలుసు. ఆచారము అనగా చేయునది అని అర్థము. గ్రహచారములో ఉన్నట్లు దశాచారములో కూడా ఆచారము కలదు. అయితే అక్కడ గ్రహము అనగా గ్రహించుకొనున దనీ, కర్మను గ్రహించుకొనుచున్నదనీ చెప్పుకొన్నాము. గ్రహములు చేసే పనినిబట్టి గ్రహచారము అనడములో తప్పులేదు. వారు గ్రహించుకొన్న కర్మను ఆచరింపజేయుచున్న పన్నెండును, పన్నెండు గ్రహములుగా చెప్పు కోవడము సరిjైున మాటగానేయున్నది. అయితే ఇక్కడ దశాచారము వద్దనే పూర్తి వివరము కనిపించడము లేదు. దశాచారము అంటే పది పనులనీ లేక పది రకాల పనులనీ అర్థము కదా! అందులో గొప్ప తనమేమున్నదని కొందరు అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! భగవద్గీతలో శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూపినప్పుడు ఆ విశ్వరూపమును చూచిన అర్జునుడు ఆశ్చర్యపడి భగవంతుడైన శ్రీకృష్ణున్ని దేవునిగా గుర్తించి అప్పుడు అర్జునుడు తన మాటలలో ఒకమాట చెప్పాడు. ఆ మాట దేవుడిట్లున్నాడని చెప్పినట్లున్నది. అర్జునుడు ఆ దినము మనకొరకు చెప్పకున్నా ఆయన లోపల భావమును వ్యక్తపరచినప్పుడు మనకు అందులో దేవుని జ్ఞానము అర్థమగుచున్నది. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగమందు 40వ శ్లోకమున ఇలా కలదు.