పుట:Jyothishya shastramu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విధముగ జాతకునికున్న మహా దశలలో అంతర్దశలను గుర్తించు కోవచ్చును. ఏ దశలోనైనా అంతర్దశలు తెలియు సూత్రమును ముందే చెప్పాము. ఉన్నదశను మరొక దశాసంవత్సరములతో గుణించి, వచ్చిన మొత్తమును 3 చే గుణించి, తర్వాత వచ్చిన మొత్తమును 30 చే భాగించగా అంతర్ధశలు తెలియును. ప్రతి జాతకమునకు దశలను మరియు అంతర్థశలను వ్రాసి ఇవ్వడము జరుగుచున్నది. నేడు చాలామంది జ్యోతిష్యులైనవారు గ్రహచార ఫలమున్నట్లే దశల ఫలితము కూడా ఉండునని తలచి వాటిని గురించి చెప్పుచుందురు. అయితే గ్రహచారములో ఉన్నట్లు దశాచారములో ఉండదని అందరికీ తెలియజేయుచున్నాము. గ్రహచారములో గ్రహముల ఆధీనములోని కర్మలు ఆచరణకు వచ్చుచున్నవి.