పుట:Jyothishya shastramu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనిషి పుట్టినప్పుడే అతను పుట్టిన కాలమునుబట్టి నిర్ణయించుకొని జీవితాంతము అలాగే ప్రవర్తించుచుందురు. అదంతయు గ్రహచారము అనుకొన్నాము.

ఒక మనిషికి పుణ్యకర్మ అమలు జరుగునప్పుడు, పుణ్యము ప్రకారము మంచి సుఖములు అందునప్పుడు అతను దేవుని విధానములో ప్రవేశించి జ్ఞానదూషణ చేశాడనుకొనుము. అప్పుడు దశాచారములోని చెడు గ్రహము అతడు చేసిన దూషణకు ప్రతిగా వచ్చిన పాపమును స్వీకరించి తన దశలో వానిని ఆ పాపముచేత హింసించును. జ్ఞానదూషణ చేసిన వ్యక్తికి అమలు జరుగు పాపమును ఏ యోగులూ క్షమించలేరు, ఏ జ్ఞానమూ దానిని దహించదు. దానిని తప్పక అనుభవించు క్షమించబడని పాపము అంటాము. గ్రహచారములో గల కర్మను యోగులైనవారు క్షమించవచ్చును. జ్ఞానము ప్రారబ్ధకర్మను కాల్చగలదు. ప్రతి మనిషికీ గ్రహచారము సర్వసాధారణము. అదంతయు మనిషి చేసుకొన్న ప్రారబ్ధకర్మనుబట్టియుండును. దానిలో ఒకమారు పుట్టుక సమయములో నిర్ణయింపబడిన కర్మను ప్రపంచ విధానము లో ఏ ప్రక్రియ మార్చలేదు. ఎటువంటి వాడుగానీ, దానినుండి తప్పించు కొనుటకు వీలులేదని చెప్పుకొన్నాము. అయితే దశలు మాత్రము ప్రపంచ విధానములో ఏమీ ఉపయోగపడవు. అవి దైవవిధానములోని సృష్ఠించబడు పాపములకు, పాప నిర్మూలనమునకు తయారు చేయబడినవని తెలియ వలెను. ఒక విధముగా మానవునికిది ఒకవైపు శాపములాంటిది, మరొకవైపు వరములాంటిది. జ్ఞానదూషణ దైవదూషణ చేసినవానికి శాపములాంటిదని చెప్పవచ్చును. అలాగే దైవజ్ఞానము పొందినవానికి వరములాంటిదని చెప్పవచ్చును. ఈ రెండు విధానములున్న దశలను ఎలా కనుగొవాలి అను విషయుమును తర్వాత చెప్పుకొందాము. ఇప్పుడు జన్మ లగ్న కుండలి లోని గ్రహములకు ఇరుగిల్లు పొరుగిల్లు ఏవిగలవో ప్రక్క పటము చూస్తాము.