పుట:Jyothishya shastramu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకనూ మూడు గ్రహములు ఏ నక్షత్రములో ఏ పాదములో ఉన్నదీ తెలియదు. దానిని ముందు వివరముగా తెలుసుకొందాము.

జాతకుని జన్మకుండలిలోని (కాలచక్రములోని) పన్నెండు లగ్నములలో తొమ్మిది గ్రహములను మాత్రము గుర్తించుకొన్నాము. మిగత మూడు గ్రహములను గుర్తించుకోవలసియున్నది. వాటిని సులభముగా గుర్తించుకొనుటకు జన్మ లగ్నకుండలిని (కాలచక్ర భాగములను) నక్షత్ర పాదముతో గుర్తించుకొనునట్లు పెద్దగా వ్రాసుకొని తర్వాత పేజీలోగల 56వ చిత్రటములో చూస్తాము.

భూమి సూర్యునికి ఎదురుగా సమాన వేగముతో తిరుగుచున్నది. కావున సూర్యుడు ధనుర్‌లగ్నమున మూలా నక్షత్ర రెండవ పాదములో యుంటే, భూమి సూర్యునికి ఎదురుగా మిథునలగ్నమున మృగశిర నక్షత్ర 4వ పాదమున ఉన్నట్లు తెలియుచున్నది. అలాగే మిత్ర గ్రహము కేతువు క్రింది పాదములోయుంటూ కేతువునుబట్టి సమానముగా కదలుచుండును. కావున కేతువు ఎక్కడుంటే దానిక్రింది పాదమే మిత్రదని తెలియవలెను. ఈ జాతకము ప్రకారము మిత్ర పునర్వసు 2వ పాదములో ఉన్నట్లు తెలియుచున్నది. ఇకపోతే చిత్ర గ్రహము యొక్క విషయానికి వస్తే చిత్ర ఎల్లప్పుడూ రాహు గ్రహమును అనుసరించి కదలుచూ రాహువున్న నక్షత్రము కంటే క్రింది నక్షత్రములోయున్నది. కావున చిత్ర రాహువుకంటే క్రింద