పుట:Jyothishya shastramu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాసినవి లేవు. అలాంటపుడు మిగత మూడు గ్రహముల విషయము ఎలా తెలియునని ప్రశ్నవచ్చును. గ్రహముల విషయములు వాటి గమనములు అన్నియు పంచాంగము ద్వారా తెలియకపోతే ఇంతవరకు మేము చెప్పిన జ్యోతిష్యమే తెలియకుండ పోవును. ఇటువంటి చిక్కు సమస్య వస్తుందను ముందు చూపుతో దేవుడు ఒక మంచి పనిచేశాడు. దానితో మూడు గ్రహముల విషయము, గమనము మనమే స్వయముగా తెలియ వచ్చును. అదెలాయనగా! దాని వివరమును ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నవగ్రహముల పంచాంగములో ఛాయా గ్రహములని పేరుగాంచిన రాహువు, కేతువు రెండు గ్రహములున్నవి కదా! అవికాక మిగత ఏడు గ్రహములు ఎడమనుండి కుడిప్రక్కకు తిరుగుచుండగా, రాహు కేతువులు మాత్రము కుడినుండి ఎడమకు తిరుగుచున్నట్లు తెలుసుకొన్నాము. అంతేకాక రాహుగ్రహము కేతుగ్రహము రెండూ కాలచక్ర లగ్నములలో ఒకే వేగము కల్గియున్నాయి. రెండు గ్రహములుగానీ మూడు గ్రహములుగానీ ఒకే వేగము కల్గియున్నప్పుడు వాటిలో ఒక గ్రహము యొక్క స్థానము ఎక్కుడున్నది తెలిసిన దానినిబట్టి మిగత గ్రహముల స్థానములను సులభముగా తెలియవచ్చును. ఒకే వేగముగల గ్రహముల మధ్యదూరము ఎప్పటికీ ఒకే రకముగా ఉండును. అందువలన ఒక గ్రహము కదలికను బట్టి మిగత గ్రహము యొక్క కదలికలను తెలియవచ్చును. ఉదాహరణకు కాలచక్రములో రాహు కేతువులు ఒకే వేగమును కల్గియున్నాయి. కావున వాటి గమనమును కాలచక్రములో ఎట్లున్నది గమనించుము. దీని ఆధారముతో క్రొత్తగా తెలిసిన మూడు గ్రహములను పంచాంగము లేకున్నా సులభముగా ప్రక్కపేజీలో గ్రహించవచ్చును.