పుట:Jyothishya shastramu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీద వ్రాసి చూచారు. అవి కూడ కొన్ని తరములకు శిథిలమై పోయెడివి. ఎంత కష్టపడినా, ఏమివ్రాసినా అది నాలుగు లేక ఐదు సంవత్సరములకంటే ఎక్కువ కాలము ఉండెడిది కాదు. అలాంటప్పుడు నలభై లక్షల సంవత్సరము లప్పుడు వ్రాసిన జ్యోతిష్యము అప్పటికి మాత్రమే తెలిసినది, గురుశిష్య పరంపరగ ఒకరి తర్వాత ఒకరు తెలియుచూ వచ్చినా, తెలిసినవారు ఇతరులకు పూర్తి చెప్పకనే, కొన్ని ఉపద్రవముల వలన అకస్మాత్తుగా చనిపోవుట చేత ఆ విషయములు అంతటితో తెలియకుండ పోయినవి. అందువలన కృతయుగములోనేయున్న ద్వాదశ గ్రహముల విషయము తెలియకుండ మాసిపోయినది. చివరకు నవగ్రహములు మిగిలాయి. బ్రహ్మవిద్య కూడా మొదట సృష్ఠి ఆదిలోనే సూర్యుడు మనువుకు చెప్పినా, మనువు ద్వారా మిగతావారికి తెలిసినా మిగతా యుగములలో తెలియకుండ పోయినది. సూర్యుడు చెప్పినప్పుడు ఒకరికొకరు అందరూ తెలుసుకొన్నా రనీ, తర్వాత అనతికాలమునకే తెలియకుండా పోయినదనీ భగవద్గీతలోని జ్ఞానయోగమున 1, 2 శ్లోకములలో చెప్పియున్నారు. ఎంతో జాగ్రత్తగా తెలుసుకొన్న బ్రహ్మవిద్యయే తెలియకుండ పోయినప్పుడు 40 లక్షల సంవత్సరములప్పుడు చెప్పిన జ్యోతిష్యము ఇంత కాలముండుటకు అవకాశమేలేదు. అందువలన పేరుకు మాత్రము జ్యోతిష్యము ఉందిగానీ, పూర్వమున్న పన్నెండు గ్రహములు పోయి వాటి బదులు తొమ్మిది గ్రహముల జ్యోతిష్యము మిగిలియున్నది. ఇప్పుడు మనకు కావలసినది పన్నెండు గ్రహముల జ్యోతిష్యశాస్త్రము. కృతయుగములోనే చెప్పబడిన, పన్నెండు గ్రహముల విషయమును మేము తెలిసి మీకు తెలిపినా, దానికి సంబంధించిన పంచాంగములు లేవు. నేడు లభ్యమగు పంచాంగములు నవగ్రహములను గురించి వ్రాసినవేగానీ, పన్నెండు గ్రహములను గురించి