పుట:Jyothishya shastramu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరిగి జ్యోతిని చేయుటకు ప్రయత్నిస్తాను. జ్యోతి వెలుగులో దేనినైనా చూచి చెప్పగలుగుటకు అందరినీ తయారు చేయుటకు ప్రయత్నిస్తాము. హిందూ (ఇందూ) ఫతమునకు వదలివేసిన జ్యోతిష్యశాస్త్రమునూ, బ్రహ్మ విద్యాశాస్త్రమునూ అందరికీ ఉన్నతస్థాయిలో కన్పించునట్లు చేయుటకు ప్రయత్నిద్దాము. అందుకు తగినట్లుగా హిందువులందరూ తమ పిల్లలు పుట్టిన సమయమును వ్రాసుకొని కంప్యూటర్‌లోని సాప్ట్‌వేర్‌ ద్వారా జాతక చక్రమును అప్పటి కాలగ్రహముల అమరికను ప్రింట్‌ అవుట్‌ తీయించుకొని పెట్టుకోవలెను. మొదట ప్రతి హిందువు తమ జాతకచక్రమును తమవద్ద యుంచుకొంటే దానిని గురించి తెలుసుకొనుటకైనా కర్మచక్ర జ్ఞానమును తెలుసుకోవచ్చును. దాని అనుబంధముతో బ్రహ్మవిద్యనే తెలియవచ్చును.

45. మూడు క్రొత్త గ్రహముల గమనమును ఎలా గుర్తించాలి?

మూడు గ్రహములు ఇప్పుడు మనకు క్రొత్తవే అయినా పూర్వము అందరికీ సుపరిచయమైనవేనని చెప్పవచ్చును. పూర్వము వ్రాసిన గ్రంథములలో మూడు గ్రహములను ఎవరూ వ్రాయలేదే అని ఎవరైనా మమ్ములను అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు. పేపరు తయారై అచ్చుయంత్రములు వచ్చిన తర్వాత గ్రంథములు తయారై నాయి. అచ్చుయంత్రములు వచ్చి దాదాపు ఇప్పటికి 120 సంవత్సరములు అయిందనుకొంటాను. అంతకుముందు తాటి ఆకులమీద దబ్బనముతో గుచ్చి వ్రాసెడివారు. అలా వ్రాసిన తాటి ఆకులు వెయ్యి సంవత్సరములకంటే ఎక్కువ నిలువయుండేటివి కావు. వెయ్యి సంవత్సరములలోపలే అవి మార్పుచెంది ముట్టుకుంటే విరిగిపోవడము జరిగెడిది. వేయిసంవత్సరముల కంటే ఎక్కువ ఉండుట కష్టముగా ఉండేది. దానికంటే ముందు గుడ్డల