పుట:Jyothishya shastramu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పవచ్చును ఎందుకనగా! గణితశాస్త్రముగానీ, ఖగోళశాస్త్రముగానీ, రసాయనశాస్త్రముగానీ, భౌతికశాస్త్రముగానీ జాతీయశాస్త్రములుగా ప్రపంచ మంతా ఒప్పుకొనుచుండగా జ్యోతిష్యము శాస్త్రమేకాదని హిందువులకు దానిని అప్పజెప్పడము అన్ని విధముల మంచిదే. ఇంకొక విషయము ఏమంటే బ్రహ్మవిద్యాశాస్త్రమును కూడా ఇది ఇందూ (హిందూ) మతముది అని చెప్పడము వారికి తెలియకనే మనకు మర్యాద ఇచ్చినట్లయినది. నేడు ఇతర మతములవారందరూ జ్యోతిష్యమునూ, బ్రహ్మవిద్యనూ మూఢ నమ్మకముగా పరిగణిస్తూ ఆ రెండిటిని హిందూ (ఇందూ) మతమునకు వదలివేశారు.

నేడు సూర్యచంద్ర మొదలగు గ్రహములను ఆధారము చేసుకొని చెప్పు జ్యోతిష్యము భారతదేశములో ఇందూమతము (హిందూమతము) లోనే కలదని చెప్పుచున్నాము. అయితే ప్రాచీనులైన మన పెద్దలు ఎంతో తెలివిగా ఎన్నో విషయములను కనుగొని వాటిని మనకు అందించినా, చివరకు విలువైన ఆ సమాచారమును కొంత జారవిడుచుకొన్నామని తెలియు చున్నది. అలా జారవిడుచుకొన్న వాటిలో ద్వాదశ గ్రహములుపోయి నవ గ్రహములైనవి. ఏ విధముగా ఇందూ అను మాటను జారవిడుచుకొని అందులో కొంతయినా హిందూ పదమును పట్టుకొన్నట్లు, ద్వాదశ గ్రహములను జారవిడుచుకొని చివరకు నవగ్రహములను మాత్రము పట్టు కొన్నాము. ఇప్పుడు మేము ఏ విధముగా ఇందూ ఫతమునకు (హిందూ మతమునకు) పూర్వ వైభవము తేవాలనుకొన్నామో, అలాగే పూర్వము ‘‘జ్యోతి శాస్త్రము’’ అను పేరుతోయున్న దానికి పూర్వవైభమును తెచ్చుటకు నేడు మార్గము తప్పి జ్యోతి పోయి జ్యోతిష్యము అయినట్లు పన్నెండు పోయి తొమ్మిదిగాయున్న గ్రహములైన వాటిని తిరిగి పన్నెండు చేసి జ్యోతిష్యమును