పుట:Jyothishya shastramu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా భక్తులు కొందరు అడిగారు. సత్యసాయిబాబాగారి విషయము చాలా సంవత్సరముల పూర్వము ఒక సందర్భములో ఆయన దీర్ఘాయుస్సు కలవాడనీ ఆయన ఆయుష్షు 96 సంవత్సరములున్నా, బహుశా 92వ సంవత్సరము చనిపోవచ్చుననీ చెప్పినట్లు జ్ఞాపకమున్నదని చెప్పాము. అప్పటికి బాబాగారి వయస్సు 86వ సంవత్సరము జరుగుచున్నట్లు వినికిడి. దానినిబట్టి ఆయన ఇప్పుడే చనిపోడు ఇంకా ఐదు సంవత్సరములు బ్రతుకు తాడని చెప్పాము. అయితే బాబాగారు ఏప్రిల్‌ 24వ తేదీ చనిపోయినట్లు తెలిసినది. ఆయన ఆయుష్షు 96 అయితే మేము చెప్పినది 92 సం॥ములు. ఆయన చనిపోయినది 86 సంవత్సరములలో. దీనినిబట్టి మేము చెప్పిన ఆయుష్షుకంటే ఆరు సంవత్సరములు ముందే చనిపోయాడు. చెప్పిన జ్యోతిష్యము తప్పా అని ఆలోచిస్తే, జ్యోతిష్యములో తప్పులేదని తెలియు చున్నది. ఈ విషయములో ఎందుకలా జరిగినదని చూస్తే రెండు రకముల కారణాలు తెలియుచున్నవి. (ఒకటి) బాబాగారు అకాలమృత్యువు చేతనైనా చనిపోయివుండాలి లేక (రెండు) ఆరు సంవత్సరముల జీవిత కర్మ జ్ఞానముచే కాలిపోయి ఉండాలి. బాబాగారు సాధారణ వ్యక్తికాదు, కాబట్టి ఆయన ఆయుష్షులో ఆరు సంవత్సరముల కర్మ కాలిపోయి ఉండవచ్చును. అనుభవించుటకు కర్మలేని దానివలన బాబాగారు ఆరు సంవత్సరములు ముందే చనిపోయాడని చెప్పవచ్చును. అయితే ఈ విషయము పూర్తిగా తెలియనందువలన జ్యోతిష్యమునే తప్పుగా అనుకోవచ్చును. వాస్తవమునకు జ్యోతిష్యములో శాస్త్రబద్దముగా ఆయన చనిపోవలసినది 92 సంవత్సరము లకు. జ్యోతిష్యమునకు కర్మలు తప్ప జ్ఞానము వలన జరుగు పనులు తెలియబడవు. కావున ఆయన ఆరు సంవత్సరములు ముందే చనిపోవు విషయము జ్యోతిష్యమునకు తెలియదు. జాతకము బాబాగారు పుట్టినప్పుడు