పుట:Jyothishya shastramu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరణము పూర్తి కర్మ అయిపోయినప్పుడు పొందును. దానిప్రకారము 50 సంవత్సరముల వయస్సులో చనిపోయినవాడు (అకాల మరణము పొందినవాడు) మిగతా 20 సంవత్సరములు సూక్ష్మముగా కనిపించక జీవించుచుండును. తర్వాత వాడు 20 సంవత్సరములు జీవితమును గడిపి చనిపోవును. ఈ విధానములో మనుషులు పొరపాటుపడడము తప్ప జ్యోతిష్యము తప్పుకాదని తెలియుచున్నది.

ఇకపోతే జ్యోతిష్యము ప్రకారము 70 సంవత్సరముల ఆయుష్షు కలదని చెప్పబడినవాడు 80 సంవత్సరములకు చనిపోతే, అప్పుడు ఆయుష్షున్నది 70 సంవత్సరములే కదా! అలాంటప్పుడు పది సంవత్సరములు ఎక్కువ ఎలా బ్రతుకగలిగాడని అడుగవచ్చును. ఎలా బ్రతికినా జ్యోతిష్యము ప్రకారము 70 సంవత్సరములు ఆయుష్షు అనుమాట అసత్యమైనది కదాయనీ అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! విషయమును వివరించుకొని చూడగల్గితే ఇక్కడ కూడా 70 సం॥ముల ఆయుష్షు తప్పుకాదని తెలియుచున్నది. తప్పని ఎదురుగా కనిపిస్తుంటే తప్పుకాదనడమేమిటని కొందరనుకోవచ్చును. అలా ప్రశ్నరాగలదనే వివరించుకొని చూడాలని ముందే చెప్పాము. అందువలన ఇప్పుడు మనము ఈ విషయమును గురించి వివరించుకొని చూద్దాము. ఎప్పుడో 70 సంవత్సరముల క్రిందట జాతకుని ఆయుష్షును గురించి చెప్పియుండగా, 70 గడచిన తర్వాత, 80 సంవత్సరములు బ్రతికిన తర్వాత ఆయుష్షును గురించి చెప్పినమాట తప్పని తెలియుచున్నది. ఇప్పుడు ఇన్ని సంవత్సరము లకు తప్పని తెలిసినా, తప్పుగా చెప్పబడినది ఎప్పుడు అని చూస్తే ఆ మనిషి పుట్టినప్పుడు కదా! అప్పుడు సత్యమైనది, ఆ రోజు శాస్త్రబద్ధముగా చెప్పబడినది, ఇప్పుడు అసత్యమెలా అయినదని చూస్తే, అప్పుడు చెప్పినది