పుట:Jyothishya shastramu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్యోతిష్యులు జవాబు చెప్పాలి, అయితే వారు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కారణము ఏమనగా! జ్యోతిష్యమును జ్యోతితో (జ్ఞానముతో) చెప్పడము లేదు. జ్ఞానము లేనప్పుడు జ్యోతిష్యములో జ్యోతి లేకుండ పోవుచున్నది. అందువలన పూర్తి కర్మ విధానము తెలియకుండా పోయి దానికి సరిjైున సమాధానము లేకుండా పోయినది. అయితే మేము చెప్పు జవాబు ఏమనగా!

మనిషికి జీవితమున్నట్లే అకాల మరణము, తాత్కాలిక మరణములు కర్మనుబట్టి కొందరికి వస్తున్నవి. కొందరికి రావడములేదు. ఈ రెండు మరణములున్నట్లు కూడా చాలామందికి తెలియదు. జ్ఞానులైన వారికి కూడా తాత్కాలిక మరణమున్నట్లు తెలియదు. ఈ రెండు మరణములు పూర్తి మరణము కాదు. ఈ రెండు మరణములు పొందినవారు జీవితమును సాగించుచునే ఉన్నారు. ఈ రెండు మరణములతో వారి జీవితము ముగిసి పోలేదు. అందువలన వారు బ్రతికేయున్నారు అని చెప్పవచ్చును. ఈ విషయము మీకు క్రొత్తగాయుంటే, మా రచనలలోని ‘‘మరణ రహస్యము’’ చదివితే పూర్తి సమాచారము తెలియగలదు. మనిషి ఈ రెండు మరణముల ద్వారా చనిపోయినట్లు కనిపించినా మనకు తెలియకుండా జీవించియుండి తర్వాత జ్యోతిష్యములో నిర్ణయించినట్లే 70 సంవత్సరముల ఆయుష్షులో చనిపోయినా, ఆ విషయము ఇటు జ్యోతిష్యునికిగానీ, ప్రజలకుగానీ తెలియ కుండా పోవుచున్నది. మరణము ఎప్పుడు జరిగినదీ తెలియనివారు, జ్యోతిష్యములో జాతకము ప్రకారము 70 సంవత్సరములు ఆయుష్షు అని చెప్పడము పూర్తి తప్పుగా లెక్కించుకొనుచున్నారు. ఇక్కడ ఎవరైనా పొరబడుటకు అవకాశమున్నది. కావున వారి పొరపాటేగానీ, జ్యోతిష్యము తప్పుగాదని చెప్పవచ్చును. అకాలమరణము పొందినవాడు తిరిగి కాల