పుట:Jyothishya shastramu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలకు తెలియకున్న దానివలన మనిషి అకాల మరణమును పొందినా, తాత్కాలిక మరణమును పొందినా దానినే మనిషి మరణము అనుకోవడము వలన పెద్ద చిక్కు ఏర్పడుచున్నది. జ్యోతిష్యము ప్రకారము ఒక సంవత్సరము ముందు వెనుకగా చావు సమాచారమును చెప్పవచ్చును. అయితే మనిషికి మూడు రకముల మరణములుండుట వలన, వాటిలో చెప్పబడినది గుర్తింప బడకపోవడము వలన, చెప్పిన కాలముకంటే ముందు వచ్చు అకాల, తాత్కాలిక మరణములను కాలమరణముగా పోల్చుకోవడముతో, చెప్పిన సత్యము అసత్యముగా కనపడుచున్నది. ‘‘చెప్పిన కాలముకంటే ముందే అకాల మరణము వలనగానీ, తాత్కాలిక మరణము వలనగానీ చనిపోయినా చెప్పిన సత్యము అసత్యముగా కనిపించవచ్చునుగానీ, చెప్పిన సమయము కంటే ఐదు లేక ఆరు సంవత్సరములు ఆలస్యముగా చనిపోతే అప్పుడు చెప్పిన మాటా అసత్యమే అగును కదా!’’యని ఎవరైనా అడుగవచ్చును. ఇది హేతుబద్ధమైన ప్రశ్నయే అయినందున దీనికి జవాబు ఏమనగా!

ప్రారబ్ధకర్మ పుట్టిన సమయములో నిర్ణయింపబడినది. అదియూ సంచితకర్మనుండి తీసి ఇచ్చినదానిని ప్రారబ్ధకర్మ అంటున్నాము. ప్రారబ్ధ కర్మప్రకారము 70 సంవత్సరములకు మరణము నిర్ణయించబడినట్లు తెలిసి ఇతని ఆయుష్షు 70 సంవత్సరములని చెప్పామనుకోండి. జ్యోతిష్యము ప్రకారము ఆ మాట సత్యమే అయినా ఆ జాతకుడు 80 సంవత్సరముల వరకు బ్రతికి చనిపోయాడనుకొనుము. అప్పుడు జ్యోతిష్యుడు చెప్పినది పూర్తిగా అసత్యమగును. ఒకవేళ 70 సంవత్సరములు ఆయుష్షు నిర్ణయించ బడిన వ్యక్తి 50 సంవత్సరములకే చనిపోయాడనుకొనుము అప్పుడు కూడా జ్యోతిష్యము వలన చెప్పినమాట అసత్యముగా కనిపించును. ఈ రెండిటికీ సమాధానము చెప్పవలసిన బాధ్యత మాకు కలదు. ఈ ప్రశ్నలకు