పుట:Jyothishya shastramu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నట్లు చేయును. ఒకవేళ ద్వాదశ స్థానమున జనన సమయములో పాప గ్రహమున్న (శత్రువర్గములోని గ్రహమున్న) జాతకుడు ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా చనిపోవు సమయమునకు బంధుమిత్రులు, భార్యా పిల్లలు లేనిచోట చావు లభించును. అతను ఫలానా వ్యక్తి అని కూడా బయటికి తెలియకపోవడము వలన అనాధశవము క్రింద జమకట్టి ఏ సంబంధమూ లేనివారు ఏమీ బాధపడకుండ అంతిమ సంస్కారములు చేయుదురు. అటువంటి చావులు ఎంతోమందికి కల్గినవి. అప్పుడు వారికి వారి జాతకము లోనే పన్నెండవ స్థానమున పాపగ్రహమున్నదని తెలియవచ్చును. ఎప్పుడో ఎనభై సంవత్సరములప్పుడు పుట్టిన సమయములో ఉన్న గ్రహములను బట్టి ఎనభై సంవత్సరముల వరకు జీవితము సాగడమేకాక మరణ సమయములో కూడా జాతకములోని (జనన సమయములోని) గ్రహముల ప్రాబల్యమునుబట్టియే జరుగును. కావున జీవితమును శాసించి నడుపునది జాఫతకము (జాతకము). జాఫతకము లేని జీవితమును గురించి అంచనా వేయుటకు సాధ్యపడదు. అందువలన జన్మనుండి చావువరకు దిక్సూచిలాగ యున్న జాతకమును అందరూ వ్రాసుకొనియుండడము మంచిది.

మరణ విషయములో చిక్కు సమస్య

ఇంతకుముందు ద్వాదశ స్థానమును గురించి తెలుసుకొన్నాము. ప్రథమస్థానములో కర్మ ప్రారంభమై ద్వాదశ స్థానములో కర్మ అయిపోవు చున్నది. కావున పన్నెండవ స్థానమును ఆధారము చేసుకొని ఆయుష్షును నిర్ణయించి చెప్పవచ్చుననీ, ఆయుష్షు అయిపోవడము మరణమగుట వలన, ఈ జాతకుడు ఫలాన సంవత్సరము చనిపోవుననీ చెప్పవచ్చును. అయితే జ్యోతిష్యశాస్త్రము ప్రకారము చెప్పినది సత్యమే అయినా మరణము ఏదైనదీ